సోమవారం 23 నవంబర్ 2020
Wanaparthy - Oct 15, 2020 , 03:38:58

లభ్యమైన మృతదేహాలు

 లభ్యమైన మృతదేహాలు

 వనపర్తి టౌన్‌ : వనపర్తి జిల్లా కేంద్రంలోని నల్ల చెరువులో రెండు రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలు ముగిశాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు శ్రమిం చి బోటు, జాలర్ల సాయంతో గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికి తీయించారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తు న్న జెర్రిపోతుల వాగును దాటేందుకు యత్నించిన గోపాల్‌పేట మండల ఏదు ల గ్రామానికి చెందిన బుచ్చారెడ్డి, గో వింద్‌ గల్లంతైన విషయం తెలిసిందే. వీరి ఆచూకీ కోసం మూడ్రోజులుగా అధికారు లు, పోలీసులు విశ్వప్రయత్నం చేశారు. ఆచూకీ లభించకపోవడంతో బుధవారం రామన్‌పాడుకు చెందిన నలుగురు జాలర్ల సాయంతో బోటు ద్వారా గా లింపు చేపట్టారు.

మొదటగా గోవిందు (52) మృతదేహం.. సాయంత్రం బుచ్చిరెడ్డి మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను బయటకు తీశారు. ఈ గాలింపు లో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, సీఐ సూర్యనాయక్‌, ఎస్సై వెంకటేశ్‌గౌడ్‌, షఫీ, తాసిల్దార్‌ రాజేందర్‌గౌడ్‌ ఉన్నారు. గాలింపు చర్యలు చేపట్టిన హోంగార్డ్‌ కృష్ణసాగర్‌, జాలర్లు శివతో పాటు మరో వ్యక్తి శ్రమను పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.