Chandra Babu | కన్నతల్లికే భారమైన జగన్ జన్మభూమికి భారం కాదా : చంద్రబాబు
Chandra Babu | ఏపీలో జరుగనున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు.
అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ (YCP) ఐదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా , ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు.
జగన్ (Jagan) విధ్వంసం వల్ల రాష్ట్రానికి రావలిసిన పరిశ్రమలు రాకుండా పోయాయని ఆరోపించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక పొట్టతిప్పల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని వివరించారు. కన్నతల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాదా అని జగన్ ఉద్దేశించి అన్నారు. మరోసారి కూటమి అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు.
సూపర్ సిక్స్ (Suprer Six) తో పాటు పవన్కల్యాణ్ సూచించిన మరికొన్ని పథకాలను సైతం పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయాతీలకు నిధులు ఇచ్చి సర్పంచులకు సర్వాధికారాలు అందజేస్తామని ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

