YS Jagan | పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
YS Jagan | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు సిట్ అంటే.. సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా దత్తపుత్రుడి పరిస్థితి ఉంటుందని విమర్శించారు. కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మేమంతా సభలో పాల్గొన్న వైఎస్ జగన్.. బాబు ఏం చెప్పినా జీహుజూర్ అంటూ ప్యాకేజిస్టార్ ఉంటాడని ఎద్దేవా చేశారు.
YS Jagan | జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు సిట్ అంటే.. సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా దత్తపుత్రుడి పరిస్థితి ఉంటుందని విమర్శించారు. కాకినాడలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన మేమంతా సభలో పాల్గొన్న వైఎస్ జగన్.. బాబు ఏం చెప్పినా జీహుజూర్ అంటూ ప్యాకేజిస్టార్ ఉంటాడని ఎద్దేవా చేశారు.
టీడీపీతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకోవడంపైనా జగన్ విమర్శలు గుప్పించారు. ఇది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదని.. మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి విమర్శించారు. దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు.. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో.. ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో.. చివరకు ఆ ప్యాకేజి స్టార్ కూడా ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు అని అన్నారు. ఆ ప్యాకేజిస్టార్ను భీమవరం అంటే భీమవరం.. గాజువాక అంటే గాజువాక.. పిఠాపురం అంటే పిఠాపురం.. ఇలా బాబు తన ప్రయోజనం కోసం ఎక్కడ నిలబడాలంటే అక్కడ నిలబడతాడని విమర్శించారు. చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్, జగన్‌ను తిట్టు అంటే తిట్టు.. కొట్టు అంటే కొట్టు.. అన్నట్లు ప్యాకేజి స్టార్ పరిస్థితి ఉందని జగన్ విమర్శించారు. దత్తపుత్రుడా నీకు ఇచ్చేది 80 కాదు 20 సీట్లే అంటే దానికి కూడా జీ హుజూర్ అని ప్యాకేజి స్టార్ అన్నాడని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని హోల్‌సేల్‌గా దోచుకునేందుకు.. దోచుకునేది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తుంటే.. కులాన్ని హోల్‌సేల్‌గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజి స్టార్ రాజకీయం చేస్తున్నారని జగన్ విమర్శించారు. ఈ ప్యాకేజి స్టార్‌కు మన రాష్ట్రం అంటే ఎంతో చులకన అని అన్నారు. జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్లిపోయే అంత చులకన అని విమర్శించారు. ఇంతకుముందు ప్యాకేజిస్టార్కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి.. ఇప్పుడు పిఠాపురం నాలుగోది అని.. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదని అన్నారు. ఈ మ్యారేజి స్టార్‌కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదని పేర్కొన్నారు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయని అన్నారు. ఏ ప్రాంతంపైనా ప్యాకేజి స్టార్‌కు ప్రేమ ఉండదని అన్నారు. ‘ పెళ్లికి పిఠాపురం వెళ్తూ వెనుకటికి ఒకడు పిల్లికి సంకల పెట్టుకుని వెళ్లాడు అనేది ఒక సామెత.. ఆ పిల్లిని సంకల పెట్టుకుని వెళ్లింది ఎవరనేది ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమయ్యింది.. చంద్రబాబు తన చంకన ఉన్న పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. ఇదీ గాజు గ్లాసు పరిస్థితి’ అని ఎద్దేవా చేశారు. ఈ గ్లాసుతో గటగట తాగేది చంద్రబాబు.. దాన్ని తోమి.. తుడిచి.. బాబుకు మళ్లీ అందించేది మాత్రం ఈ ప్యాకేజి స్టార్ అని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

