బుధవారం 05 ఆగస్టు 2020
Wanaparthy - Aug 01, 2020 , 08:28:39

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి

విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి

వనపర్తి రూరల్‌/విద్యావిభాగం/పాన్‌గల్‌  : తెలంగాణ ప్రభుత్వం విద్య అభివృద్ధికి  కృషి చేస్తుందని సర్పం చ్‌ భానుప్రకాష్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని చిట్యాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్స్‌, మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్యను అందిస్తుందన్నా రు. వనపర్తి పట్టణంలోని తెలుగువాడ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి హెచ్‌ఎం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. పాన్‌గల్‌ మండలం వెంగళాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం వెంకటేశ్‌యాదవ్‌ పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ నరసింహ, ప్రధానోపాధ్యాయురాలు పద్మజాదేవి, ఉపాధ్యాయులు సతీశ్‌, భగవంతు, నాయకుడు సుధాకర్‌, ఉపాధ్యాయులు శేఖర్‌, ఎస్‌ఎంసీ వైస్‌చైర్మన్‌, విద్యార్థులు ఉన్నారు. logo