మంగళవారం 31 మార్చి 2020
Wanaparthy - Jan 19, 2020 , 01:06:23

గులాబీకే పట్టం

గులాబీకే పట్టం


కొత్తకోట : కారు కనిపిస్తే సీఎం కేసీఆర్‌ గు ర్తుకు రావాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కొత్తకోట మున్సిపాలిటీలోని 13,14,15 వార్డుల్లో ఇం టింటి ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా 15 వార్డులలో పాదయాత్ర చేసి కారు గుర్తుకు ఓ టు వేయాలని ఓటర్లను కోరారు. అనంతరం 14వ వార్డులో ప్రచారం రథంలో నుంచి ప్రజలనుద్దేశించి ఎమ్మెల్యే ఆల మాట్లాడారు. 15 వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఆశీర్వదిం చి గెలిపించాలని అన్నారు. ఇతర పార్టీల ప్రలోభాలకు గురికాకుండా 70 ఏండ్ల పాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ర్టాన్ని ఏ విధంగా నా శనం చేశారో గుర్తుకు చేసుకోవాలన్నారు. ఆ రేండ్ల పాలనలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకొని తమ ఓటును వృథా చేసుకోవద్దన్నారు. ఓటు వేసే బాధ్యత మీది.. కొత్తకోట మున్సిపల్‌ను అభివృద్ధి చేసే బాధ్యత నా ది అని అన్నారు. ఈ నెల 22న జరిగే ఎన్నిక ల్లో అన్ని వార్డుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రా ష్ర్టాల్లో నిరంతర విద్యుత్‌, కల్యాణలక్ష్మీ వంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదో గమనించాలన్నారు. ప్రధానంగా 14, 15 వా ర్డులో బీడీ కార్మికులకు పింఛన్‌ మంజురు చే యిస్తామని, డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణా లు చేపట్టి గృహ అవసరాలను తీరుస్తామన్నా రు. ఎన్నికల అనంతరం 500 డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణం చేపట్టి ఒక ప్రత్యేక కాలనీగా ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎం పీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్ర శాంత్‌, కో ఆప్షన్‌ మెంబర్‌ లతీఫ్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, పీజే బాబు, మాజీ సర్పంచులు చెన్నకేశవరెడ్డి, బాలనారాయణ, టీఆర్‌ఎస్‌ అ భ్యర్థులు, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మిషేక్‌, శ్రీను, అబ్దుల్‌ ఘని వసీంఖాన్‌, చాం ద్‌పాష, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కారు గుర్తుకు ఓటేయండి : ఎమ్మెల్సీ కసిరెడ్డి

పెబ్బేరు : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎ మ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శనివారం పెబ్బేరు మున్సిపాలిటీలోని 5, 6, 7, 8వ వార్డులలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమన్వయ కర్త వంగూరి ప్ర మోద్‌ కుమార్‌రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారా న్ని చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాటాడుతూ స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్ర హ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కారు గుర్తుకు ఓటేస్తే భవిష్యత్‌ తరా ల అభివృద్ధికి బాటలు వేసినట్లేనని పేర్కొన్నా రు. టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన 12 మంది అ భ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం తన జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘనంగా జరుపుకొన్నారు.

అభివృద్ధిని చూసి ఓటేయండి : ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల

మదనాపురం (కొత్తకోట) : కొత్తకోట అభివృద్ధికి పాటుపడిన టీఆర్‌ఎస్‌కు ఓటేసి కారు గుర్తు అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి ఆల మంజుల కోరారు. శనివారం కొత్తకోట పట్టణంలోని 3,4,5,6,7 వార్డులలో అభ్యర్థులతో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆల మంజుల మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాతనే అభివృద్ధికి బాటలు పడ్డాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ చలువతోనే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆల అహర్నిశలు కృషి చేస్తున్నారని, కొత్తకోటలో మరింత అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీ 15 మంది అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, ఆయా మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


logo
>>>>>>