శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 22, 2021 , 00:16:02

అన్ని వార్డుల అభివృద్ధికి కృషి

అన్ని వార్డుల అభివృద్ధికి కృషి

  • 32వ వార్డులో అభివృద్ధి పనులను ప్రారంభించిన 
  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల

వికారాబాద్‌, జనవరి 21 : పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిగుళ్లపల్లి మంజుల అన్నారు. బుధవారం వికారాబాద్‌లోని 32వ వార్డు శివరాంనగర్‌ కాలనీలో రూ.8లక్షలతో సీసీరోడ్డు నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు కాలనీల్లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఏ వార్డులో కూడా సీసీ రోడ్డు లేకుండా ఉండకూడదని అన్నారు. దశలవారీగా అన్ని కాలనీలకు నిధులు ఇస్తామని తెలిపారు. చెత్త సేకరణలో మున్సిపల్‌ సిబ్బంది నిర్లక్ష్యం చెయ్యవద్దని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ భోగేశ్వర్లు, ఏఈ రాయుడు పాల్గొన్నారు. 

VIDEOS

logo