శనివారం 27 ఫిబ్రవరి 2021
Vikarabad - Jan 08, 2021 , 00:24:02

దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు

దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు

వికారాబాద్‌, జనవరి  7: లూయిస్‌ బ్రెయిలీ గొప్ప మానవతావాది అని, అంధులు తేలికగా చదివే విధంగా లిపి తయారీకి కృషి చేశాడని వికారాబాద్‌ అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు,వయోవృద్ధుల శాఖ జిల్లా అధికారి లలితకుమారి ఆధ్వర్యంలో బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్‌  మాట్లాడుతూ.. లూయిస్‌ బ్రెయిలీ దివ్యాంగుడైనా ఏరోజూ నిరాశపడకుండ అంధులు తేలికగా చదివే విధంగా లిపి తయారీకి కృషి చేశాడన్నారు. దానినే ఈ రోజు ఎందరో దివ్వాంగులు స్పర్శ ద్వారా చదువుతున్నారన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా  కృషి చేస్తున్నదన్నారు. ఈ శాఖ ద్వారా దివ్యాంగులకు వివిధ రకాలైన ఉపకార వేతనాలు, ఆర్థికసహాయంతో పాటు ప్రతి నెల రూ.3016 పింఛన్‌ అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌షిండే, సంక్షేమశాఖ సిబ్బంది రాజశేఖర్‌రెడ్డి, యాదగిరి, రమేశ్‌కుమార్‌, లక్ష్మణ్‌,జిల్లా వికలాంగులు పాల్గొన్నారు. 


VIDEOS

logo