బుధవారం 03 మార్చి 2021
Vikarabad - Dec 08, 2020 , 05:32:19

ఆదుకుంటున్నరైతు బంధు

ఆదుకుంటున్నరైతు బంధు

27 నుంచి పెట్టుబడి సాయం

నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం

నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఇప్పటివరకు వికారాబాద్‌ జిల్లా రైతాంగానికి అందిన రూ.1169 కోట్ల సాయం

రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండు విడుతల్లో ఈ సాయాన్ని ప్రభుత్వం  నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే సాయాన్ని జమ చేస్తున్నది. దీంతో రైతు పక్షపాతిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిలుస్తున్నారు. ఈ యాసంగిలో ఎకరాకు రూ.5 వేల చొప్పున 2,10,743 మంది రైతులకు రూ.294 కోట్ల పెట్టుబడి సాయాన్ని  ఈనెల 27 నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనున్నది. 

 వికారాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న టీ ఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ఆరేండ్ల పాలనలో రైతుల సంక్షేమా న్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, రెం డేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలయ్యిందనే విధంగా వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన వి ద్యుత్తును సరఫరా చేస్తుంది. అదేవిధంగా రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీ ని చేసేందుకు నిర్ణయించారు. మరోవైపు ఏ విధంగా అయి నా రైతు మృతి చెందితే ఆ రైతు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారి సీఎం కేసీఆర్‌ అండగా నిలుస్తూ రైతుబీమా పథకం లో భాగంగా రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నా రు. అంతేకాకుండా రైతులు అప్పుల ఉబిలో చిక్కుకోకుం డా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండు విడతల్లో రైతుబంధు సాయా న్ని ప్రభుత్వం అందజేస్తుంది. అదేవిధంగా ఎలాంటి మధ్యవర్తులు లేకుండా పూర్తి పారదర్శకంగా ఉండేందుకు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే రైతుబంధు సాయాన్ని జమ చేస్తూ రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ నిలుస్తున్నారు. 

ఈనెల 27 నుంచి రైతుబంధు సాయం...

 యాసంగి పంటల సాగు ప్రారంభమైన దృష్ట్యా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 27 నుంచి రైతుబంధు సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనున్నారు. సోమవా రం సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ రెండో విడత రైతుబంధు ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా వెంటనే నిధులు విడుదల చే యాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లా లో మూడేండళ్లలో రైతుబంధు సాయంలో భాగంగా రూ. 1169 కోట్ల సాయాన్ని రైతులకు అందజేశారు. 2018 వా నాకాలం సీజన్‌లో చెక్కుల రూపంలో ఎకరాకు రూ.4 వేల ఆర్థిక సహాయాన్ని అందజేయగా, 2018 యాసంగి సీజన్‌ నుంచి రైతులకు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. 2019 నుంచి రైతుబంధు కింద రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.5 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 2018 వానాకాలం సీజన్‌లో 1,94,833 మంది రై తులకుగాను రూ.220 కోట్లు, 2018 యాసంగిలో 1,79, 899 మంది రైతులకు రూ.206 కోట్లు, 2019 వానాకా లం సీజన్‌లో 1,78,612 మంది రైతులకు గాను రూ.255 కోట్లు, 2019 యాసంగి సీజన్‌లో 1,71,824 మంది రైతులకుగాను రూ.194 కోట్లు, 2020 వానాకాలం సీజన్‌లో 2,10,743 మంది రైతులకు గాను రూ.294 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 


VIDEOS

logo