బుధవారం 05 ఆగస్టు 2020
Vikarabad - Aug 01, 2020 , 00:01:11

త్వరలో మోడల్‌ గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభం

త్వరలో మోడల్‌ గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభం

  • జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి 

షాద్‌నగర్‌టౌన్‌ : షాద్‌నగర్‌ పట్టణంలో త్వరలో మోడల్‌ గ్రంథాలయ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని గ్రేడ్‌-1 గ్రంథాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు 45 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రేడ్‌-1 గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్నదని, దీంతో పుస్తకాలు పనికి రాకుండా పోతున్నాయని తెలిపారు. త్వరలోనే ఆధునిక వసతులతో మోడల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ సూచనల ప్రకారం ప్రతి నియోజకవర్గానికి ఒక డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటులో భాగంగా గ్రంథాలయ అధికారులకు ఆన్‌లైన్‌ శిక్షణ కూడా ఇస్తున్నారని పేర్కొన్నారు. కొందుర్గు మండలంలో కూడా నూతన గ్రంథాలయ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన గ్రేడ్‌-1 గ్రంథాలయ అధికారి తలత్‌ జహాన్‌ను షాద్‌నగర్‌ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, సభ్యులతో కలిసి సన్మానించారు. గ్రంథాలయ అధికారిణిగా ఆమె అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు జూపల్లి శంకర్‌, సుధాకర్‌, శేఖర్‌, గ్రంథాలయ అధికారి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.


logo