శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Vikarabad - Feb 09, 2020 , 23:47:49

ముగిసిన సహకార నామినేషన్ల పరిశీలన

ముగిసిన సహకార నామినేషన్ల పరిశీలన
  • మొత్తం 286వార్డులకు 933 దాఖలు
  • పలు కారణాలతో 110 నామినేషన్లు తిరస్కరణ
  • 823 ఆమో నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువుదం

వికారాబాద్‌ , నమస్తే తెలంగాణ : సహాకార ఎన్నికల నామినేషన్ల పరిశీలన ఘట్టం ముగిసింది. జిల్లాలోని ఆయా సహాకార సంఘాలలో అధికారులు నామినేషన్లను పరిశీలించారు. జిల్లాలో 22ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల్లోని 286 వార్డులకు మొత్తం 933 నామినేషన్లను అధికారులు పరిశీలించారు. వీటిలో వివిధ కారణాల వల్ల 110నామినేషన్లను తిరస్కరించగా, మిగిలిన 823నామినేషన్లను ఆమోదించారు. వీటిలో అత్యధికంగా ఎక్‌మామిడి సహకార సంఘం నుంచి 25నామినేషన్లను తిరస్కరించారు. ఇదిలా ఉండగా నేటితో ఉపసంహరణ గడువు ముగియనుంది. ఈ నెల 15న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు ఓట్లు లెక్కించి అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు. 


logo