Vasthu Shastra | పూజలు జరపకుండా సొంతంగా ఇంట్లోకి చేరడం దోషమా?
Vasthu Shastra | ప్రతి కార్యానికి ఒక విధి - విధానం పెట్టారు పెద్దలు. అవి మూఢ విశ్వాసాలు అనుకోవద్దు. వాళ్లు మూఢులు కాదు. వాటి లోతులు తెలియని చదువులు మనవి, తెలివి మనది. ఏది కట్టినా, ఏది మన జీవితంలోకి వచ్చినా.. అన్నీ మన ప్రమేయంతోనే రావు.
Vasthu Shastra | పూజలు జరపకుండా సొంతంగా ఇంట్లోకి చేరడం దోషమా?
– ఎస్. లింగేశ్వర్, ఎల్బీ నగర్
ప్రతి కార్యానికి ఒక విధి – విధానం పెట్టారు పెద్దలు. అవి మూఢ విశ్వాసాలు అనుకోవద్దు. వాళ్లు మూఢులు కాదు. వాటి లోతులు తెలియని చదువులు మనవి, తెలివి మనది. ఏది కట్టినా, ఏది మన జీవితంలోకి వచ్చినా.. అన్నీ మన ప్రమేయంతోనే రావు. మన ప్రయత్నంతో కూడా కావు. అంతెందుకు, ఒకే కడుపులో (ఒకే తల్లికి) జన్మించిన ఇద్దరు కొడుకులు గొప్పవాళ్లు అవుతారా? ఎవరి జన్మ రాకలు, ఎవరి కారణాలు వారికి ఉంటాయి. ఎవరి దశలు-దిశలు వారివి. గృహప్రవేశం.. ముహూర్తం చూసి, మంత్రసహితంగా వైదికంగా పూర్తిచేయాలి. సృష్టిలోకి మనస్థానం చేరాలి అంటే.. చుట్టుపక్కల పరిసరాలు, పరిస్థితులకు మన నివాసం నిలిచి గెలవాలంటే.. ఎన్నో నియమాలు ఉంటాయి. ఇల్లు జీవ గృహంగా వర్ధిల్లాలి అంటే.. తప్పకుండా శాస్ర్తోక్తంగా గృహ ప్రవేశం జరగాలి. ఎన్ని విధి విధానాలు.. ఎన్ని షరతులతో మనకు విదేశాలలో పీఆర్ (పర్మినెంట్ రెసిడెన్స్) వస్తుంది. ఇదికూడా అంతే.. మన ఇల్లుకూడా సృష్టితో మంత్రబద్ధంగా అనుసంధానం కావాలి.
మా ఇంటి ఈశాన్యానికి ఆనుకొని గుడి ఉంది. అలా ఉండొచ్చా? ఆ ఇంట్లో మేం ఉండొచ్చా?
– కె. ధనలక్ష్మి, కేపీహెచ్‌బీ కాలనీ
స్థలానికి తూర్పు వీధి లేకుండా.. ఇల్లు గుడికి ఆనుకొని ఉండటం మంచిది కాదు. మీరు పంపిన ఇంటి ప్లాను కూడా దోషాలతో ఉంది. నైరుతిలో ఇల్లు కట్‌చేసి మెట్లు పెట్టారు. పడమర రోడ్డుకు పారుమీద కట్టారు. కాంపౌండు లేదు. ఇవన్నీ మీకు అనర్థాలు తెచ్చే అంశాలు. కాబట్టి వెంటనే మీరున్న ఇంటిని మార్చండి. గుడి దోషం కాదు. గుడికి ఆనించి ఇల్లు కట్టడం దోషం. గుడి దగ్గరగా స్థలం ఉంటే.. ఆ స్థలానికి తూర్పున ఒక వీధి ఏర్పాటుచేయాలి. ఆ స్థలానికి తప్పకుండా ప్రహరీ కట్టాలి. అందులో చుట్టూ ప్రదక్షిణం వచ్చేలా ఇల్లు కట్టుకోవాలి. మీ స్థలం పెద్దదే అయినా, ఇల్లు పెద్దది కావాలనే ఉద్దేశంతో అనేక దోషాలతో కట్టారు. కాబట్టి దానిని మార్చడం అటుంచి, కొత్త ఇల్లు మరో చోట కట్టుకోండి. లేదా వెంటనే.. అద్దె ఇంటికి మారండి.
నేను, మా చెల్లెలు కలిసి ఇల్లు కట్టుకోవచ్చా? నాకు పెళ్లి కాలేదు. ఇద్దర్లో ఎవరు ఎక్కడ ఉండాలి? నేను కింద ఉండొచ్చా?
– డి. గిరిలక్ష్మి, నిర్మల్
అక్కాచెల్లెళ్లు ఒకేచోట ఇల్లు కట్టుకుంటే దోషం లేదు. మీకు పెళ్లి కాకున్నా.. ఇద్దరిలో మీరే పెద్ద కాబట్టి కింద మీరు ఉండి, పైన మీ చెల్లెలికి కట్టి ఇవ్వొచ్చు. మీ చెల్లెలు గృహలక్ష్మి కాబట్టి, వారు మొదటి అంతస్తులో ఉండేలా ఇల్లు ఏర్పాటు చేయండి. ఆ స్థలం మీ ఇద్దరిలో ఎవరి పేరు మీద ఉందో చెప్పలేదు. ఎవరి పేరుమీద ఉన్నా.. మున్ముందు న్యాయ పరమైన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. స్థలాన్ని కలిసి కొంటే.. ఎవరి స్థలాన్ని వారు ముందుగానే విభజించి, ఎవరి ఇల్లు వారు వేర్వేరుగా కట్టుకోండి. కలిపి ఒకే ఇల్లు కట్టవద్దు. ఒకే ఇంట్లో ఉండొద్దు. ఏదైనా శాస్త్రబద్ధంగా కట్టుకోండి. మీకు పాత ఇల్లు ఉంటే కనుక.. దాని విధానం ఎలా ఉందో చూపించుకోండి. మీరు ఒంటరిగా మిగిలిపోయారంటే.. మీరు పుట్టిన ఇంట్లో తప్పులు ఉండే ఉంటాయి.
మేము ఇల్లు కడుతున్నాం. కానీ మధ్యలోనే నిర్మాణం ఆగిపోయింది. దానికి వాస్తు లోపం కారణమా?
– ఎమ్. రాము, కోరుట్ల
మనిషి ప్రయత్నానికి ప్రకృతి సహకారం ఉండాలి. అందరూ, డబ్బు ఉంటే ఇల్లు కట్టవచ్చని అనుకుంటారు. అలాఅని డబ్బు ఉన్నవాళ్లంతా ఇల్లు కట్టినవాళ్లే అనుకోవడానికి లేదు. గృహయోగం అనేది ముఖ్యం. మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఆపేశారు అంటే.. కారణాలు అనేకం ఉండవచ్చు. మీరు ఉన్న ఇల్లు బాగుందా? అనేదీ ఒకసారి చూపించుకోండి. అలాగే కడుతున్న ఇల్లు మీరు ప్లాన్ చేశారా? తెలిసిన వారిచేత చేయించారా? చూడండి. సొంతవైద్యం ప్రమాదం కదా! ఈశాన్యం తెంపు చేసి కట్టే ఇల్లు, నైరుతి వీధిపోటు ఉన్న ఇంట్లో ఉంటూ కట్టే ఇల్లు.. పూర్తి చేయడం గగనం. అలాగే.. కట్టే ఇంటికి నైరుతిలో బావి, పడమర పార్కు ఉంటే కూడాయజమాని ఆ గృహంలోకి చేరడంలో అవరోధాలు ఏర్పడతాయి. అన్నీ చూపించి.. మళ్లీ నిర్మాణం ప్రారంభించండి.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

