Vaasthu Shastra | ‘అదృష్టం ఉంటే ఏ వాస్తూ, ఏ శాస్త్రం అక్కరలేదు’ అంటున్నారు. నిజమా?
Vaasthu Shastra | ‘అదృష్టం ఉంటే ఏ వాస్తూ, ఏ శాస్త్రం అక్కరలేదు!’ అంటున్నారు. నిజమా? - ఎం. శ్రీలక్ష్మి, కంచనపల్లి | అదృష్ట ఫలమే.. శాస్ర్తామోదిత గృహ నిర్మాణం. వ్యక్తి స్వభావజనితంగా ఒక వాస్తు గృహం కొని, నిత్య ఎదుగుదలతో నివసిస్తుంటాడు.
Vaasthu Shastra | ‘అదృష్టం ఉంటే ఏ వాస్తూ, ఏ శాస్త్రం అక్కరలేదు!’ అంటున్నారు. నిజమా?
– ఎం. శ్రీలక్ష్మి, కంచనపల్లి
అదృష్ట ఫలమే.. శాస్త్రామోదిత గృహ నిర్మాణం. వ్యక్తి స్వభావజనితంగా ఒక వాస్తు గృహం కొని, నిత్య ఎదుగుదలతో నివసిస్తుంటాడు. అదే అతని అదృష్టం. అంటే.. స్వభావసిద్ధ ఫలం. అది లేనప్పుడు దృష్టిఫలం పొందాలి. అంటే.. పెద్దలు చేసింది, చూసి పాటించాలి. అంతపెద్ద వాళ్లే ఈ శాస్ర్తాన్ని ఆమోదించి ఆచరిస్తున్నారు. మనం ఎలాగూ కొత్త ఇల్లు కట్టాలని అనుకుంటున్నాం. అన్ని రకాలుగా ఆమోదం తీసుకొని కడితే బాగుంటుందని భావించడం స్వయం శక్తి ఫలితం. అందుకే, శాస్ర్తాలు జన బాహుళ్యంలో అంత ప్రాచుర్యం పొందాయి. మీరు అన్నట్టే.. అలాంటి శాస్త్ర సమ్మతమైన మనసు ఎందరికి ఉంటుంది? ఒక్క విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. మన జీవితంలో జరిగిన మంచి లేదా చెడు ఫలితాలలో మన మనోగతమైన, శారీరకమైన ప్రమేయం లేకుండా ఏవీ, ఎప్పుడూ, ఎక్కడా, ఎవరికీ జరుగవు. ఇది సత్యం కదా! మన నియంత్రణలో ఉండి, మన ప్రమేయంతో మన వ్యక్తిత్వం, నిబద్ధత, క్రమశిక్షణతో చేసిన వాటితోనే మనం సాధించినవి ఎక్కువగా ఉంటాయి. మన శాస్ర్తాలను పక్కన పెట్టి ఎవరో చెప్పిన మాటలు విని, ఎలా పడితే అలా కట్టి.. ఆ తరువాత ఎదురైన సంఘటనలను బట్టి, ‘అప్పట్లో సరిగ్గా ఆలోచించి కట్టి ఉంటే బాగుండేది’ అని అనుకుంటారు. అందుకే, అదృష్టం – దురదృష్టం రెండిటిలోనూ మన ప్రమేయం ఉండకుండా ఉండదు. నిజం చెప్పాలంటే ఈ సమాజంలో అందరూ అదృష్టవంతులే! వారివారి స్వభావాలు, వాటి తాలూకు నిర్ణయ ఫలితాలే వారిని అదృష్టవంతుల్ని – దురదృష్టవంతుల్ని చేస్తాయి. అందుకే పెద్దలు కొన్ని పద్ధతులను, మార్గాలను అందించి వెళ్లారు. పాటించడం, పాటించకపోవడం మన ఇష్టం.

ఆగ్నేయం నుంచి నైరుతి వరకు బాల్కనీ పెట్టొచ్చా? మొక్కలు పెట్టుకోవాలి. గ్రిల్స్ కూడా వేస్తాం.
– కె. ఫణీందర్, పెద్దపల్లి
కేవలం కొన్ని దిక్కులనే అధికం చేసి కొన్ని దిశలను పట్టించుకోకపోతే.. ఆ దిశల సమృద్ధి మనకు అందదు. దక్షిణం – ఆగ్నేయం దిశలను కలుపుకొని, ఆ వైపు మొక్కలు పెంచుకున్న దానికి సమానంగా.. సమతుల్యంగా తూర్పు-ఉత్తరం దిశల్లో కూడా బాల్కనీ వేసుకోవాలి. బాల్కనీ దేనికి వాడుతారు అనేది అప్రస్తుతం. కానీ, తూర్పు-ఉత్తరాల్లో బాల్కనీ లేకుండా దక్షిణం-ఆగ్నేయంలో వేయకూడదు. మీరు అటు దిక్కు (దక్షిణం – ఆగ్నేయం) గ్రిల్స్ వేస్తే.. అది గృహంలోకి వస్తుంది అనుకుంటున్నారు. కాదు.. గృహం చుట్టూ గోడలు మారినప్పుడే ఆ భాగం గృహంలోనిది అవుతుంది. మన భావాలకు అనుగుణంగా శాస్త్రం ఉండదు. ఆ దిశలకు బాల్కనీ అనుసరణీయం కాదు.

మా ఇంటికి ఉత్తర ద్వారం ఉన్నది. పడమర వీధికి నైరుతి ద్వారం పెట్టి, రెండు పోర్షన్లు చేశాం. అలా ఉండొచ్చా?
– కె. కౌసల్య, ఆత్మకూరు
ఇంటిని రెండు పోర్షన్లు చేసినప్పుడు అటు దక్షిణం ఒక పోర్షన్, ఇటు ఉత్తరం ఒక పోర్షన్ చేయవచ్చు. లేదా పడమర – తూర్పుగా కూడా రెండు పోర్షన్లు చేయవచ్చు. పోర్షన్ ఎలా, ఎటు వైపు చేసినా.. చతురస్రంగా లేదా దీర్ఘ చతురస్రంగానే చేయాలి. వాటిని ఒక్కో విభాగాన్ని బట్టి.. ఒకదానికి, ఆగ్నేయం – పడమర పోర్షన్కు వాయవ్యం వైపు కిచెన్ పెట్టాలి. ఆ విధంగా రెండు పోర్షన్లూ.. ఒక్కోదానికి నైరుతిలో బెడ్రూమ్ వచ్చేలా చేయాలి. రెండు పోర్షన్లకూ ద్వారాలు ఉత్తర-ఈశాన్యంలో వచ్చేలా చూడాలి. నైరుతి ద్వారం మంచిది కాదు. వెంటనే దానిని తొలగించండి. పడమర వీధికి నైరుతి ద్వారం పెడితే.. యాక్సిడెంట్లు, అకాల మరణాలు సంభవిస్తాయి. మీది పడమర వీధి కాబట్టి.. నిరభ్యంతరంగా తూర్పు – పడమర పోర్షన్లు చేసుకోవచ్చు.

నాలుగో తరగతి స్థలాలు అంటే ఏమిటి? స్థలాలను అలా భాగాలుగా చూడొచ్చా? భూమి అంతటా ఒకటే కదా?
– జీవన్ రెడ్డి, కొరటికల్
ఏ రంగంలో అయినా.. స్థానాలు సాధారణం. భూమి అనేది ఒకటే అయినా.. ఒక్కో చోట ఒక్కో లక్షణంతో ఉంటుంది. కాబట్టి ఇంటి బ్లాకులను బట్టి ఇంటి స్థలం తరగతులలో మార్పులు వస్తాయి. శాస్త్రం ప్రకారం.. వీధులు రావడాన్ని బట్టి నాలుగు తరగతులుగా స్థలాలను విభజన చేశారు. వాటిలో ప్రథమంగా.. తూర్పు – ఉత్తరం రోడ్డు ఉంటే మొదటి తరగతిగా గుర్తించారు. దక్షిణం రోడ్డు – పడమర రోడ్డు ఉంటే నైరుతి బ్లాకుగా.. నాలుగో తరగతి స్థానంగా గుర్తించారు. అయితే దాన్ని అథమంగా భావించడం తగదు. నైరుతి స్థానం కార్యదక్షతకు ప్రతీకగా కూడా నిలుస్తుంది. అయితే ఆ స్థానాన్ని ఎలా కట్టాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది చూసుకొని నిర్మాణం చేయాలి. ఏ స్థలం అయినా, ఏ తరగతి అయినా.. భూమి లక్షణాలు కూడా బాగుండాలి. అప్పుడే అక్కడ ఉంటున్నవారికి శుభం, లాభం.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

