Vasthu Shastra | నిత్యం మంత్ర జపం వల్ల ఇంట్లో దోషాలు పోతాయా?
Vasthu Shastra | నిత్యం మంత్ర జపం వల్ల ఇంట్లో దోషాలు పోతాయా?
– కె. సుజాత, మోత్కూర్
‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ అనేది రుషి వాక్యం. అంటే మనసుతో మననం చేస్తే రక్షించేది మంత్రం. శబ్ద ప్రకంపనలే మంత్రం. ఏ శబ్దమైనా ఏదో ఒక అక్షరాన్ని ఆధారం చేసుకొనే ఉత్పన్నం అవుతుంది. ఆ శబ్దం లేదా ఆయా అక్షరాల పదం ఉచ్చారణ ద్వారా ఒక శక్తి ఉత్పన్నమై మనసును తేలిక పరుస్తుంది. ఆయా పదాల సమూహమే మంత్రం అవుతుంది. ఆ మంత్రంలోని అక్షరాలు మానవ శరీరంలోని పంచభూతాలను ప్రభావితం చేస్తాయి. ఇది సత్యం. ఆ అక్షరాలు కొన్ని నెగెటివ్‌గా స్పందింపజేస్తాయి. కొన్ని పాజివిట్‌గా స్పందింపజేస్తాయి. గుడిలోని గంట మనసును తేలికపరిచి ఏకాగ్రతను సృష్టిస్తుంది. వేద మంత్రాలు మనసును అంతర్ముఖం చేస్తాయి. ఇతరత్రా కొన్ని అక్షరాలు, వాటి శబ్దాలు కేవలం శరీరం గంతులు వేయడానికి ఉసిగొల్పుతాయి. ఇల్లు.. శబ్ద ప్రకంపనల నిలయం. ఇల్లే కాదు.. గుడి, గుడిసె, గుహ, ఫ్యాక్టరీ అన్ని నిర్మాణాలూ శబ్ద ప్రకంపనల కేంద్రాలే! అయితే, ఆ శబ్దాలు మనిషి మీద ఎలాంటి ప్రభావం కలిగిస్తున్నాయనేది ముఖ్యం. అందుకు నిర్మాణశైలి ఉపకరిస్తుంది. శాస్త్రీయ పద్ధతిలో నిర్మితమైన గుడి.. గృహం జీవ నిర్మాణమై మనల్ని పాజిటివ్ శక్తులతో ప్రభావితం చేస్తుంది. గాలి ఒకటే.. అది పిల్లన గ్రోవిలోంచి వెళితే అందమైన స్వరం, సాధారణ గొట్టంలోంచి పోతే బుస్మనే శబ్దం.. వాన చినుకులు ఆకులమీద పడితే ఒకరకం శబ్దం, ఇనుప రేకుల మీద పడితే మరోరకం శబ్దం.. ఇలా పరికరం ప్రతిస్పందన తీరును బట్టి శబ్ద సృష్టి ఉంటుంది. అయితే, మంచి గృహంలో.. కోవెలలో శాస్త్రీయ సంగీతం వినడం వల్ల ఉత్సాహం కలగడం వరకు ఓకే! కానీ, వక్రతల.. దోషాల.. వికృత పరిసరాలలోని శబ్ద ప్రకంపనలు గొప్ప ఫలితాలు ఇవ్వలేవు. అవి నెగెటివ్ శక్తులతో ఉంటాయి. కేవలం ఇంద్రియాలనే ఉసిగొల్పుతాయి. హృదయం స్పందన వక్రమవుతుంది. మంత్రాలు వల్లె వేయడం మంచిదే కానీ, అవి గృహదోషాలను నివారిస్తాయనేది నిజం కాదు. పూజారి ఇల్లయినా బాగుండాల్సిందే. గృహం అనేది ముందు మనకు అర్థంకావాలి. మనసు యొక్క ఘన స్వరూపమే గృహం. ఆ మనసు ఎవరో కాదు.. సాక్షాత్తు ఆ గృహ యజమానే!
పిల్లల పడకగదిలో టాయిలెట్‌ను ఉత్తరం వైపు పెట్టొచ్చా?
– వి. బలరామ్, కొండగట్టు
సాధారణంగా ఉత్తర – వాయవ్యంలో చిన్నపిల్లల పడకగది వస్తుంది. కొందరు ఈశాన్యం దిశలో కూడా పిల్లల పడక గదులు వేస్తున్నారు. మీరు అడిగే పిల్లల గది ఏదో తెలియదు. ఈశాన్యం పిల్లల గదిలో అసలు ఏదిశలోనైనా టాయిలెట్ వేయవద్దు. ఆ గదికి ఆగ్నేయం అయినా.. వాయవ్యం అయినా దోషమే అవుతుంది. ఇంటి వాయవ్యం దిశలో పిల్లల గదిని వేసినప్పుడు ఆ గదికి ఉత్తరంలో లేక ఉత్తర – వాయవ్యం మూలన టాయిలెట్ ఉండాలి. ఆ గదికి ఉత్తరమంతా టాయిలెట్ వేయద్దు. అందులో వాయవ్యం మూలన దక్షిణం.. లేదా ఉత్తరం ముఖంగా లెట్రిన్ పిట్ వేసుకొని వాడుకోవాలి.
చెరువుల పక్కన, వాగుల పక్కన వెంచర్లు వేయడం మంచిది కాదా?
– ఎం. మల్లారెడ్డి, గచ్చిబౌలి
మనిషి ఏదో వ్యూ (అందమైన ప్రకృతి) కోసం వాస్తు దోషం వలలో పడుతున్నాడు. దేనిమీద అయినా ప్రేమ ఉండటం తప్పుకాదు. కానీ, అతి మోహం మంచిది కాదు. దక్షిణం చెరువు గట్టు వద్ద, పడమర వాగు పక్కన మంచి వ్యూ ఉందని ఇండ్లు కట్టుకొని ఉండాలనుకోవడం సరైన పద్ధతి కాదు. కేవలం భౌతికమైన సౌందర్యమే మనకు ఆనందం ఇవ్వదు. ఆత్మగతం చేసే ప్రకృతి పరిసరాలు మనిషికి శాంతినిస్తాయి. అందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దిశలూ ఉన్నాయి. కోడి కూర తినాలంటే కోడిని డైరెక్టుగా తినలేరు కదా! దాన్ని శుద్ధి చేసి, కోసి ఏవో మసాలాలు వేసి వండుతారు. ఇదీ అంతే! తూర్పు – ఉత్తరం చెరువులు ఉంటే వాటికి దూరంగానే వెంచర్లు వేసుకోవాలి. తూర్పున సముద్రం ఉంది కదాని గట్టున ఇల్లు కట్టవద్దు.
మాది పడమర రోడ్డు ఉన్న దవాఖాన. ఉత్తరం రోడ్డు కూడా ఉంది. సింహద్వారం ఎటు పెట్టాలి?
– కె. భాగ్యలక్ష్మి, పరిగి
రెండు రోడ్లల్లో ప్రధాన వీధి ఎటు అనేది మీరు చెప్పలేదు. ఒకవేళ పశ్చిమం మెయిన్ రోడ్డు అయితే, దానినే ప్రధానంగా చేసుకొని ఆసుపత్రికి పడమర వైపు సెంటర్లో గ్రాండ్ ఎంట్రీ ఏర్పాటుచేసి కట్టుకోండి. హాస్పిటల్ కదా.. రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉత్తరం ప్రధాన రోడ్డు అయితే దానినే ప్రధానంగా ఎంచి, ఉత్తరం సెంటర్లో పెద్ద ద్వారంతో కట్టండి. ఉత్తరం సామాన్యమైన వీధి – పడమర మెయిన్ రోడ్డు అయితే పడమరకే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాకాక.. ఉత్తరం గొప్పది అని, పడమర ఎంట్రీ లేకుండా ఉత్తరం పెట్టవద్దు. ఉత్తరం వైపు ద్వారం పెడుతూనే పశ్చిమాన్ని కూడా సింహద్వారంగా నిర్మించాలి. రాజవీధే ప్రధానం.. ఎక్కడైనా!
Read More :
Vaasthu Shastra | చనిపోయిన తల్లిదండ్రుల పేర్లు ఇంటి గేటుకు పెట్టుకోవచ్చా?
Money Plant |మనీ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనట
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

