Vasthu Shastra | స్థలం కొనగానే ఇల్లు కట్టుకోవచ్చా? కొన్నాళ్లు ఆగితే మంచిదా?
Vasthu Shastra | స్థలం కొనగానే ఇల్లు కట్టుకోవచ్చా? కొన్నాళ్లు ఆగితే మంచిదా?
– బి. సిద్ధిరాములు, ఆత్మకూరు
స్థలంలో ఇంటి నిర్మాణం చేయడానికి మంచి ముహూర్తం చూసుకోవాలి. ఆ ముహూర్తం రోజువరకు స్థలాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. వెంటనే ఇల్లు కట్టకూడదనేమీ లేదు. కానీ, మంచిరోజు చూసుకోవడం అనేది అవసరం. ముఖ్యంగా ‘స్థల శుద్ధి’ లేకుండా చాలామంది మూలలు పెరిగినా, అందులో రాళ్లు, గుండ్లు ఉన్నా, సరైన సంస్కరణ చేయకుండా ఇల్లు కట్టేస్తుంటారు. ఇది మంచిది కాదు. ‘ల్యాండ్ స్కేప్’ కోసం స్థల శుద్ధి ఆపవద్దు. చాలామందికి అవగాహన లేకున్నా.. ఈ ప్రక్రియ ఎంతో అవసరం. ఇంటి స్థలంలో ఎన్నో ఏండ్లుగా అనేక జీవులు నివాసం ఉంటాయి. వాటన్నిటిని తొలగించడానికి ‘భూమి పూజ’ అనేది గొప్ప కార్యం. అందుకు సిద్ధం చేసి మీ గృహనిర్మాణం ప్రారంభించండి.
దక్షిణం రోడ్డు పెరిగిన స్థలంలో ఇల్లు కట్టొచ్చా? లేదంటే, అలాగేవాస్తు వదిలేయాలా? ఈ విషయంలో వాస్తు ఏం చెబుతుంది?
– కె. రాములు, కండ్లకోయ
ఇంటి స్థలానికి దక్షిణం రోడ్డు వస్తుంది అంటే, అది ఎటూ పెరగకుండా చక్కగా సాగినప్పుడే ఆ స్థలాలు ముందుముందు బాగుంటాయి. దక్షిణం వీధి, అటు ఆగ్నేయం పెరుగుతూ పోతే ఆ వీధి వరుస ఇండ్లకు ‘దక్షిణ – నైరుతి’ వీధిపోట్లు వస్తూ ఉంటాయి. అలాకాకుండా ఇటు నైరుతి పెరుగుతూ పోయినా.. ఆ వీధి వరుసలో అన్ని ఇండ్లకూ ‘ఆగ్నేయం’ వీధిపోటు పడుతూ ఉంటుంది. పక్కవాళ్లు అంటే.. మీ పడమర ఇంటివాళ్ల దక్షిణం పారును సరిగ్గా చూసుకొని, మీ స్థలానికి ‘పారు పట్టి’ దానికి సమానంగా ముందు మీ స్థలాన్ని సరిచేయాలి. ఆ పడమర ఇంటివాళ్లు సరిచేసి కట్టిన ఇల్లు అయితేనే.. దానిని అనుసరించాలి. వాళ్లది పాత ఇల్లు.. ముందుముందు దానిని తీసేసి కొత్తది కడతారనుకుంటే.. మీ ఇంటి నిర్మాణం ఆపాలి.
నాలాల పక్కన ఇండ్లు కొనొద్దా? వాటిని బాగుచేయలేమా?
– బి. హనుమంతు, హనుమకొండ
ఇంటి పరిసరాలు మన ఆలోచనల మీద, ఆరోగ్యం మీద నిరంతరం బలమైన ముద్ర వేస్తుంటాయి. మనకు తెలియకుండానే మన మనసు చుట్టుపక్కల వాతావరణానికి వత్తాసు పలుకుతుంది. ఏది చూస్తుందో.. ఏది వింటుందో.. దేనిని వాసన చూస్తుందో దానిలా మనసు రూపాంతరం చెందుతుంది. ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఇంటిని ఎంచుకోవాలి. ఇల్లు దొరకడం, కొనడం.. అచీవ్మెంట్ కాదు. పసిపిల్లాడిలాంటి మనసును గొప్పగా పాజిటివ్‌గా ప్రభావితం చేసే ప్రాంతంలో గృహం ఉండాలి. నేడు విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు ఇంతగా ప్రాచుర్యం పొందడానికి కారణం అదే. వాళ్లేమీ బంగారు ఇటుకలతో కట్టరు. పచ్చదనం – ఆహ్లాదం వారి ప్రధాన ఆకర్షణ. నాలాలు మురికినీరుతో నిండి, నిరంతరం మన కండ్ల ముందు ప్రవహిస్తుంటే.. ఆ కాలుష్యం ఆరోగ్యాన్ని, అంతరంగాన్ని చెడగొట్టడం ఖాయం. కేవలం గృహశోభనే కాకుండా, దాని చుట్టూ ఉండే పరిసరాలను కూడా మనం పట్టించుకోవాలి.
మా స్థలం నలభై అడుగుల వెడల్పు, వంద అడుగుల పొడవు ఉంది. అందులో ఇల్లు ఎలా కట్టుకోవాలి?
– శ్రీమాధవి, పోచంపల్లి
పెద్ద స్థలంలో చిన్న ఇల్లు మాత్రం కట్టవద్దు. అవసరం అయితే, ఆ వంద అడుగుల పొడవు స్థలాన్ని రెండు భాగాలు చేయండి. అప్పుడు సమతూకంలో ఇల్లు కట్టుకోవచ్చు. దేని ప్రహరీ దానికి పెట్టండి. పెద్ద ఇల్లు ఆ పూర్తి స్థలంలో కట్టాలని అనుకుంటే.. ఇంటి నిర్మాణం స్థలం మధ్యన కట్టండి. అంటే, పడమర భాగం ఎక్కువ వదిలి, తూర్పు భాగం దానికన్నా కొన్ని ఫీట్లు మాత్రమే ఎక్కువ పెంచి ఆ స్థలంలో మీ ఇంటి వైశాల్యానికి (ఎస్ఎఫ్టీ) తగ్గట్లు ప్లాన్ గీయించుకొని, ఇల్లు కట్టుకోండి. మొత్తం స్థలంలో తూర్పేకదా.. ఎంతైనా ఖాళీ వదులుకోవచ్చు అని ఇంటిని పడమరకు చేర్చి, చిన్న ఇల్లు కట్టవద్దు. తద్వారా మీకు మంచి ఫలితాలు అందవు.
Read More :
Vasthu Shastra | ఓపెన్ కిచెన్‌కు ఈశాన్యంలో ద్వారం పెట్టొచ్చా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
- Tags
- Vasthu
- Vasthu Shastra
- vastu
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

