– కె. విజయభాస్కర్, తూప్రాన్.
Vastu Shastra | సృష్టిలో శక్తి లేనిది ఏదీ లేదు. అలా ఆలోచిస్తే.. మనిషి ఒక్కడే శక్తిహీనుడు. ఒక చిన్న మేకును బల్ల నుంచి వేళ్లతో బయటికి తీయలేడు. ఆ పనికి ఏదో ఒక సాధనం కావాలి. అలా.. ఏదైనా అంతే! సముద్రాన్ని దాటాలన్నా, ఆకాశంలో ఎగరాలన్నా.. ఎన్నో వాహనాలను సృష్టించుకొని ప్రయోజనాలు పొందుతున్నాడు. ఇల్లు అందరూ అనుకున్నట్లు కుటుంబ ప్రయోజనమే కాదు. మనిషి జన్మ ప్రయోజనానికీ అవసరం. ఎందుకు వచ్చామో.. ఆ జ్ఞానం పొందడానికి అనువైన, అనుకూలమైన వ్యక్తి మనోవికాసానికి దోహదపడే ప్రకృతి మనోజ్ఞ మందిరం.. గృహం. ఏ అద్భుతం జరిగితే.. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారి.. ఆ (ప్యూపా దశ) కట్టుకున్న తన గూటినుంచి వినూత్న జీవితాన్ని పొందుతుంది? ఏ నిగూఢ శక్తి దానిని అంతగా మార్చిందో.. అలాంటి శక్తి ప్రకృతికి ఉంది.
అదే శక్తి సూత్రాలతో మన గృహం కూడా నిర్మాణం కావాలి. మనిషి ఎగరలేక పోవచ్చు. కానీ, ఎగిరించే వాహనాన్ని సాధించాడు. అలా జీవిత లక్ష్యాలను సాధిస్తూ, కుటుంబగతమైన వృద్ధిని పొందుతూ.. తన జీవిత లక్ష్యాన్ని, ఆధ్యాత్మిక వికాసాన్ని అందుకోవాలి. ఎన్ని పొందినా.. ఎందుకు మనిషి ఆనందంగా ఉండలేక పోతున్నాడు. ఎందుకు డబ్భు ఏళ్లు వచ్చినా, ఎన్నో ఉన్నత పదవులు పొందినా.. ఎందుకు ఆ కళ్లలో నిరాశ – నిస్పృహ. అందుకే, శాస్త్రం అంటుంది.. ‘అశాంతస్య కుతఃసుఖం’. మనిషికి ఎన్ని సంపదలు – చుట్టూ మంది – హోదా ఉన్నా.. గుప్పెడు గుండెలో పిడికెడు శాంతిలేదు.
తను వెతికే సుఖం, శాంతి తన వద్దనే ఉంది. కానీ, అది పొందే మార్గం అందకే.. అంధకారంలో మునిగిపోతున్నాడు. ఇల్లు అంటే.. కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు. అంతులేని ఆత్మ సంపదను కూడా అందించే వికాసాన్ని, మార్గాన్ని చూపుతుంది. అది మట్టి పొరల గర్భంలోంచి పుట్టుకొస్తుంది. శరీరం – శక్తి కూడా ఆ మట్టినుంచే వచ్చింది. పంచభూతాలు లేకుండా సృష్టిలో ఏదీ ఆకారం దాల్చలేదు. అలా ఇల్లు కూడా ఒక అద్భుతాల కూడలి. ఆనందాల మందిరం. దాన్ని అర్థం చేసుకోవడానికి దైవకృప ఉండాలి. మానవ కృషి కావాలి.
– వి. కావ్య, కేపీహెచ్బీ కాలనీ.
ఉన్న ఇంట్లో దోషాలను మార్పు చేయాలి. అప్పుడు మారాల్సిన అవసరం ఉండదు కదా! మనకున్న నిర్లక్ష్య వైఖరి.. లోపల ఉండే తక్కువ చూపు.. ‘ఏమౌతుందిలే!’ అనే అంతరంగ ధోరణి.. మిమ్మల్ని అడ్డుకుంటున్నది. అంతేకానీ, ఇల్లు మీ చేతులను కట్టివేయదు. ఇక్కడే మనం గట్టిగా నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ సందేహం నన్ను అడగడం అంటేనే.. ఇల్లు మార్చుకునే అవకాశం ఇవ్వడం. ప్రకృతి మనకు ఏదో విధంగా తెలుపుతుంది. దాని భాషను అర్థం చేసుకోవాలి. కానీ, మనమే దాని గొంతునొక్కి.. విరుద్ధంగా ఆలోచిస్తాం. ఇదేకాదు.. ఆరోగ్యం విషయంలోనూ అంతే! మీరు స్థలం బాగుంది అనుకుంటే.. ఇంట్లో దోషాలను సంపూర్ణంగా మార్చివేయండి. లేదా అద్దె ఇంటికి మారండి. కొంతకాలం మంచి ఇంట్లోకి వెళ్లాక వచ్చే అనుభవం వేరుగా ఉంటుంది. అప్పుడు మీరే అంటారు.. ఇన్నాళ్లూ ఆ ఇంట్లో ఎలా ఉన్నాం! అని. మనం చేసే ప్రయత్నానికి మీ సంకల్పం బలంగా ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది. రేపు ఏదైనా పెద్ద ప్రమాదం అయ్యాక బాధపడితే ప్రయోజనం ఉండదు.
– పి. మురళి, చెర్ల.
ఉత్తరంలో, తూర్పులో ఇంటికి సీ-త్రూ (హాలో) చేసి కట్టుకోవచ్చు. దానినే కోర్టుయార్డు అంటారు. కింద నేలమీద లాన్ వేస్తారు. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ, ఇల్లు కట్టేటప్పుడు ఉత్తరం – తూర్పు ఇంటిని కట్చేసి, ఇంగ్లీష్ అక్షరం ‘సి’లాగా కడుతున్నారు. అలా కడితే ఇంటికి ఉత్తరమే లేకుండా పోతుంది. అది మంచిదికాదు. ఇంట్లో లాన్కాదు.. ఇంటి చుట్టూ లాన్ ఉండటం మంచిది. ఇంటి గర్భం మధ్యలో ఆకాశం కనిపించేలా ఛత్రశాల గృహం వేరు. ఇలా తూర్పు – ఉత్తరం కట్ చేయడం వేరు. ఇంటిని సగం వరకు కత్తిరించినప్పుడు ప్రధాన జీవస్థానం లేకుండా పోతుంది. ఇంటి శరీరంలో చాలా వికృత మార్పు వస్తుంది. స్త్రీదోష గృహం అవుతుంది. అలా కాకుండా ఇంట్లో పడమర మెట్లు పెట్టి, తూర్పు మధ్య ‘హాలో’ ఇచ్చి.. చక్కని విశాలమైన హాలుతో ఇంటిని కడితే.. అద్భుత ఫలితాలు వస్తాయి. ఎక్కువ సీ-త్రూ (హాలోలు) పెట్టకుండా ఇల్లు కట్టండి. కొత్త ఇల్లు కట్టేటప్పుడు రాజీ పడవద్దు. ఆర్భాటాలకు పోవద్దు.
– బి. లత, సికింద్రాబాద్.
ఇంటి లోపల మెట్లు పెట్టడం వల్ల గర్భస్థానం చెడిపోకుండా చూడాలి. మన ఆలోచనకు శాస్త్రం తన సమ్మతిని తెలపాలి. ఇంటి మధ్య ఎలాంటి మెట్లు నిర్మాణం చేయకూడదు. ఇక ప్రధాన పడకగదికి పక్కన ఆనుకొని అన్నప్పుడు.. మాస్టర్ బెడ్రూమ్ కొలతపైన ఆధారపడి ఉంటుంది. ఇంటి వెడల్పులో ఎంతభాగం మాస్టర్ బెడ్రూమ్ కట్టారు? అదిపోను.. మధ్య హాల్ ఎంతుంది? హాల్ భాగం మొత్తం గృహ విభాగంలో సరిగ్గా ఉందా? అనేవి చూసుకొని కట్టాలి. పడక గదిని మెట్లు ఆనుకొని కట్టడం దోషంకాదు. కానీ, మెట్ల స్థానం మొత్తం గృహంలో ఏ వైపు జరిగి ఉంది? అనేది చూసి, దక్షిణ భాగం లేదా పశ్చిమ భాగం వచ్చేలా డిజైన్ చేసి, ఉచ్ఛమైన నడక మెట్లు ఒకే వరుసతో వేసుకోవచ్చు. అన్నీ జాగ్రత్తగా చూసుకోండి.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143