– డి. నిర్మల, సిద్దిపేట.
మీరు ఇచ్చిన వివరాలను చూశాను. మీకున్న వీధి పశ్చిమ నైరుతిని పెంచుతూ పోయింది. కేవలం మీ స్థలానికే కాదు.. ఆ వరుసలో ఉన్న ఇండ్లకు, స్థలాలకు కూడా ఆ పడమర రోడ్డు దక్షిణ-నైరుతిలో వీధిపోటు కలిగిస్తూ వెళ్తుంది. అలాగే, ఉత్తర-వాయవ్యం కూడా! ఇలాంటి వీధి ఉన్నచోట తప్పకుండా పక్కవారి ఇండ్ల నిర్మాణాన్ని అనుసరించి, జాగ్రత్తగా ప్లాను చేసుకోవాలి. మీ ఇంటికి రెండువైపులా ఇప్పటికే ఇండ్లు కట్టి ఉంటే.. వాటి పడమర ఇంటిపారును చూసి ఆ వరుసలలో మీ ఇల్లు నిర్మాణం చేయాలి.
ఇరువైపులా ఉన్నవారి ఇండ్లు పాతవి, అలాగే కొనసాగుతున్నాయంటే.. ఆ తర్వాత ఇండ్లను చూసి, తగినంత వెనక్కి జరగాలి. అంటే, రోడ్డువైపు ఖాళీ వదిలి కాంపౌండ్ కట్టాలి. ఆ కాంపౌండ్ నుంచి తగిన దూరంలో ఇల్లు ప్లానుచేసి కట్టాల్సి ఉంటుంది. అన్నీ సరిగ్గా చూపించుకొని ముందుకు వెళ్లండి. తొందరపాటు పనికిరాదు. కట్టిన తర్వాత వీధిపోట్లు రాకుండా చూడాలి. అందులో స్థలం వదిలాక ఇల్లు ఎంత వస్తుందో చూసుకోవాలి. కష్టం, ఇల్లు రాదు అనుకుంటే.. ఆ స్థలాన్ని వదిలివేయండి. ఇల్లు కడితే జీవితకాలం ఉండేలా ఉండాలి.
– కె. వెంకట్, జీడికల్.
బరువు అంటే, మోయగలిగే దానికి అర్థం కాదు. ఆ స్థానం సముచితమా? కాదా? అనేదానిని అర్థం చేసుకోవడానికి వాడుతారు. భూమికి ఏది బరువు, ఎక్కడ బరువు? చెప్పండి. ఇంటి చుట్టు పరిసరాలలో ఏ స్థానంలో దేనిని ఎలా అమర్చుకోవాలి? అనే విషయంలో నైరుతిలో స్టోర్ పెడతారు. నైరుతిలోనే పడక గది ప్రధానంగా కడతారు.

ఇందులో ఏది బరువు? ఈశాన్యం రాకపోకలకు, గాలి-సూర్యుని వెలుగులకు అడ్డం రాకుండా ఓపెన్‌గా ఉండాలని అక్కడ బరువు (నిర్మాణం) వద్దు అంటారు. మీ ఇంటి చుట్టు ఉన్న ప్రదక్షిణ స్థలంలో పశ్చిమ-దక్షిణ నైరుతిలో పెద్ద గుండు తెచ్చిపెట్టడం శాస్త్రం కాదు. ‘మన ఇంటి వెనక పరిసరాలు ఎత్తుగా ఉంటే.. బలం’ అనే ఉద్దేశం అంతే! కానీ, ప్రతి ఇంటి వెనక ఒక గుండు తెచ్చిపెట్టడం వల్ల నైరుతి లేకుండా, వాడుకలోనే ఉండకుండా పోతుంది. అది శాస్త్రసమ్మతం కాదు. ఏదైనా గది యజమానికి కావాలి అంటే.. నైరుతి శక్తిమంతమైంది అని చెబుతారు.
– జి. కృష్ణ, గద్వాల.
కట్టిన ఇండ్లను కలపడం మంచిది కాదు. ముఖ్యంగా అపార్ట్మెంటులో ఫ్లాట్‌కి-ఫ్లాట్‌కి మధ్యన ఖాళీ స్థలం వదిలి కడతారు. ఆ విధంగా కడితేనే వాటికి వెంటిలేషన్ ఉంటుంది. ఈ విధంగా ఇండివిజువల్‌గా ఉన్న ఫ్లాట్స్‌ని కలపాలి అంటే.. రెండిటి మధ్య గ్యాప్‌లో స్లాబ్ వేసి, రెండు పోర్షన్లను కలుపుతారు. ప్రతి ఫ్లాట్‌కి కిచెన్, టాయిలెట్లు, డైనింగ్ ఏరియా సపరేటుగా విభజన చేసి ఉంటాయి. రెండు ఫ్లాట్స్‌ని కలపడం వల్ల డివిజన్ అనేది కుదరదు.
ఒక ఇంటి పంపకం వేరు. రెండు ఇండ్ల పంపకం (విభజన) వేరుగా ఉంటుంది. మధ్యలో ఇండ్లు కలిపినప్పుడు అటు తూర్పు, ఇటు పడమర ఇల్లు తెగిపోతాయి. ఇల్లు ‘హెచ్’ ఆకారంలో తయారవుతుంది. అది చాలా వికృత ఫలితాలను ఇస్తుంది. ఇద్దరు పిల్లలు తలలు అంటుకొని పుట్టినట్టుగా ఉంటుంది జీవితం. మీరు వెంటనే రెండిటినీ వేరు చేయండి. ఉత్తరం-దక్షిణం ఫ్లాట్‌లో ఏది బాగా ఉంటే.. అందులోకి మారండి. ఇల్లు పెద్దదిగా చేసుకునే విధానం ఇది కాదు.
– డి. వీరస్వామి, ఖమ్మం.
గాడి తప్పిపోతున్న గారడీ లోకమిది. ఎవరు, ఏది, ఎందుకు చేస్తున్నారో.. వారికే సరిగ్గా తెలియదు. ఆలయం ఎంతో ప్రశస్తమైన శక్తి ప్రాంగణం. దానికి ఎన్నో నిగూఢ నియమాలు, ఆగమానుసారమైన విధులు ఉంటాయి. కాబట్టి, అలాంటి చిన్నచిన్న గుడులు శక్తి లేనివని చెప్పలేం. మహోన్నత జీవాలయాలు అనికూడా నిర్ధారించలేం. రోడ్లపక్క దుమ్ములో, ధూళిలో, డ్రైనేజీ కాలువల పక్క కూడా టిఫిన్లు తింటూ ఉంటారు.
గొప్పగా ఆలయంలో ఆహారం వండి దైవసన్నిధిలోని సత్రాలలో ఆహారం తింటూ ఉంటారు. దేనిని నివారించగలం చెప్పండి. ప్రతి నిర్మాణానికి దైవిక శక్తి కలిగిన సత్రాలు ఎన్నో ఉంటాయి. వాటిని అనుసరించనివి ఏవీ గొప్ప స్థాయిని అందుకోలేవు. శక్తి లేనిది చిన్న ఇసుక రాయి కూడా లేదు. కానీ, అది రాకెట్ కాదు కదా! అలా వేటి విలువలు వాటివి. లోకంలో అన్నీ ఉంటాయి. అన్నిచోట్లా మనుషులు కనిపిస్తారు. ఏది వ్యక్తిగతంగా ఉద్ధరణకు మూలం అవుతుంతో.. ఎంపిక చేసుకోవాల్సింది మన చేతిలో ఉంటుంది. అంతే..
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143