తానో రహస్యమే…
కాలం ఏదో ఒక నెపంతో బాధిస్తూ చెప్పకపోతే తనకి విలువ ఉండదని భయం కాబోలు
కాలం ఏదో ఒక నెపంతో
బాధిస్తూ చెప్పకపోతే
తనకి విలువ ఉండదని
భయం కాబోలు
పచ్చి నిజాల నుండి కూడా
నాలుగు కన్నీటి చుక్కలని
గురుదక్షిణ కోరకుండా
ఉండలేదు అనుకుంటా
కొన్ని రాత్రుళ్లు
నిద్రను తాకట్టు పెట్టుకుని
కొన్ని పగుళ్లను
చీకటితో చిట్లకొట్టి
కోరికల పావులతో
మనిషిని ఉసిగొల్పి
మనసు చదరంగంలో
ఓటమిని చవి చూపుతుంది..
సమస్యల మధ్య
నలిగే మనిషిలో
ఊపిరిని ఒడిసిపట్టి
ప్రాణం పోకుండా కక్ష తీర్చుకుంటుంది..
ప్రశ్నల అంపశయ్య
జీవితాన్ని పడుకోపెట్టి
బతుకును ముళ్లకర్రతో
అదిలిస్తుంది…
ఎంత చదువుకున్నా
ఇంకెక్కడో మార్కులు తగ్గినట్లు
ఇంకేదో తప్పుపడుతూ
మోసంతో ద్రోహం చేస్తుంది.
ఎండిన ఆశతో
చిగురు చేతులు కలిపితే
ఓర్వలేని చూపులు
చటుక్కున తుంపుతాయి
నమ్మి పూజించినా
తన నిజస్వరూపంతో
నమ్మలేని సమస్యతో
గొప్పగా పరీక్ష పెడుతుంది.
ఫలితాలని దాచిపెడుతుంది..
కాలం నాలుగు దిక్కులుగా
కాలం నాలుగు గోడలుగా
ఓ మాయలా….ఓ గాయంగా
ఓ పాఠంలా…. ఓ ప్రశ్నలా
తానో రహస్యమే
చందలూరి
నారాయణరావు
9704437247
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్పై హరీశ్రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

