– కోటిపల్లి రాధ, కాచిగూడ
స్విమ్మింగ్‌పూల్ తూర్పు, ఉత్తరం, పడమర దిక్కుల్లో రాకూడదు. ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలో విశాలమైన స్థలంలో.. ఇంటికి తూర్పులో, ఈశాన్య-ఉత్తరాలలో స్విమ్మింగ్ పూల్ నేలమీద ఉండటం శాస్త్రపరంగా ఎంతో చక్కని అంశం. ఇంటిపైన కట్టాలి అంటే దానిని తూర్పు-ఉత్తరంలో తొట్టిలాగా పెద్ద హౌస్ ఏర్పాటు చేయాలి. అది ఆ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా లోతుగా ఉండాలి. అలాగని కింద స్లాబ్ కన్నా కిందికి దిగకుండా.. కిందిఫ్లోర్ని దోషం లేకుండా నిర్మించాలి. దక్షిణ-పశ్చిమంలో స్లాబ్ ఎత్తు చేసి, పైన తూర్పులో నీరు నిలువ ఉంచేలా నిర్మించాలి. కింది ఫ్లోర్ సమానంగా ఉండేలా ఫాల్స్ సీలింగ్‌తో లెవెల్ కలిపి కట్టుకోవాలి. అన్ని సవివరంగా తెలుసుకొని కట్టాలి. పైన నీరు ఉన్నా.. అది ఎక్కడ ఎంత శాతం ఉండాలనేది తెలుసుకొని నిర్మించుకోండి.
– లాస్య బృంద, నారాయణగూడ
మీ స్థలం రెండు వీధులున్న ఈశాన్యంలో ఉంది. రెండు రోడ్లు ఒకే ఎత్తు లేనప్పుడు పల్లం ఉన్న వీధికి ప్రధాన ద్వారం పెట్టి ఇల్లు కట్టాలి. మీది మంచి బ్లాక్ అయితే రెండు దిశలకు తప్పనిసరిగా సింహద్వారాలు ఉండాల్సిందే. కేవలం ఒక వీధికే కాకుండా రెండు వీధులకు గేట్లు కూడా సరైన స్థానంలో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

దిశ ఎలా ఉందో తెలియదు. స్థలం సరిగ్గా ఉత్తరానికి అమరి ఉంటే.. ఆ చోట ఇల్లు నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. తూర్పు రోడ్డు ఎంత ఎత్తు ఉందో.. అంతకన్నా రెండు అడుగులు ఎత్తుగా ఉండేలా ఇంటి ఫ్లోరింగ్ నిలిపి కట్టాలి. తప్పనిసరిగా కాంపౌండ్లు కట్టాల్సి ఉంటుంది.
– అరుంధతి, బేగంపేట
మెట్లు బయటైనా, లోపలైనా ఉత్తరంలో రాకూడదు. ఉత్తర-వాయవ్యంలో మెట్లు బయట వేసుకోవాలి. ఇంటిలోపల దక్షిణంలో మెట్లు విశాలంగా, లిఫ్ట్టుతో కలిపి వేసుకుంటే అప్పుడు ఆ ఇల్లు డూప్లెక్స్ అవుతుంది. కాబట్టి ఉత్తరంలో సీత్రూ రావాల్సి ఉంటుంది. అంతేకాదు మెట్లు పడమర మధ్యలో కూడా పెట్టుకోవచ్చు.

అయితే తూర్పులో సీత్రూ ఉండాలి. ఉత్తరం మధ్యలో మెట్లు ఇంటికి రావద్దు. తద్వారా ఇంటి ఉత్తర గర్భం ఇంటినుంచి వేరవుతుంది. స్త్రీలకు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు వస్తాయి. ఒంట్లో అన్ని శరీర భాగాలు వేరు వేరు స్వభావాలతో సున్నితంగా ఉంటాయి. వేటిని ఎలా వాడాలో.. అలాగే ఇంటిలో ఆయా దిశలను శాస్త్ర బద్ధంగా వాడాలి. మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు.
– వాసం లక్ష్మి, చండూర్
స్థలాన్ని బట్టి మన ఇంటి కొలతలు నిర్ధారణ చేసుకోవాలి. ఇంటిచుట్టూ ఖాళీ వదులుతూ తూర్పు వీధి ఉంటే అటుగా గేటు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ ఖాళీ ఉంచి తక్కువ స్థలంలో ఇల్లు కట్టుకోవాలి. హాల్ అనేది ఇంటి భవిష్యత్తును నిర్ధారించే గర్భస్థానం. దీనిని మీ ఇంటి వైశాల్యాన్ని బట్టి నిర్ధారించాలి.

హాల్లో ఎలాంటి గదులు కట్టకుండా ఆర్చిలు రాకుండా ఉండాలి. ఈశాన్యాన్ని కలుపుతూ ఉండే హాల్ ఎంతో శ్రేష్ఠం. చీకటి లేకుండా విశాలంగా హాల్ ఉండాలి. దక్షిణం, ఉత్తర దిక్కుల్లో ఉన్న కిటికీలనుంచి వెలుగులు ప్రసరించాలి. వంటగది ఆగ్నేయంలో వచ్చేలా చూడండి. ఈశాన్యంలో డ్రాయింగ్ రూమ్ ప్రత్యేకంగా ఆర్చితో విభజిస్తూ, హాలుతో అనుసంధానం చేయండి. శుభకరం.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143