– దామోదర్, నార్కెట్‌పల్లి
ఆలయాలన్నీ ఆగమ శాస్ర్తానుసారం కడతారు. అయితే నగరాల్లో, వీధుల్లో, నడి రోడ్లమీద ఉండే ఆలయాలు అన్నీ శాస్త్ర సమ్మతంగా ఉంటాయి అని అనుకోవద్దు. వీటిల్లో కొన్ని మాత్రమే జీవాలయాలు. ఆలయ నిర్మాణం అతిగొప్పది, ప్రాచీనమైనది కూడా.. అవి నేటికీ కొన్నిచోట్ల నిత్య కళ్యాణంతో విరాజిల్లుతున్నాయి.
మానవశరీరంలో ఒక అంతరాత్మ కనిపించకుండా కొలువై ఉన్నప్పుడు ఆలయాలలో దైవం నిండి ఉంటాడు అని అంటారేమో. ‘దేహో దేవాలయః ప్రోక్తో.. జీవో దేవః సనాతనః’ అన్నది వేదం. అంటే ఈ శరీరమే ఒక దేవాలయం దీనిలోని జీవుడు శాశ్వతుడిలాగా దేవాలయంలో శక్తిని పాదుకొల్పి ప్రతిష్టాపన చేస్తారు. దాని నిర్మాణాన్ని శాస్త్రపరంగా చేస్తారు. వాస్తు శాస్త్రంలో శైవ, వైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ నిర్మాణాలు ఉంటాయి.
– కోల చరణ్, కూకట్పల్లి
ఇల్లు నిర్మాణానికి ముందు స్థలం శుద్ధి చేయాలి. దానిలో అన్నీ వస్తాయి. ఇంటి స్థలాన్ని మూలమట్టానికి సరిచేయాలి. పెరిగిన మూలలు కట్ చేయాలి. దక్షిణ-పశ్చిమం కొంతమేర పునాదితో గోడ కడితే.. ఇక దానికి తిరుగు ఉండదు. అన్నీ కలిసివచ్చి గృహం ఆగకుండా సాగుతుంది. మీ స్థలంలో నైరుతి పెరిగినపుడు.. దానిలో గది ఉన్నా, ఏది ఉన్నా ముందు దానిని తొలగించి మెట్నకు చేయండి.

గది ఉపయోగపడుతుంది కదా! అని ఆలోచించవద్దు. ఆ పెరిగిన భాగం మనది కాదనుకొని వదిలి వేయాలి. ఎంత ఉన్నా సరే.. ఇతరులకు ఇచ్చి వేయాలి. గోడలు కట్టిన తరువాత కూడా యజమానులు వాడటం మంచిది కాదు. ఇల్లు కట్టకముందే మీరు స్థలాన్ని ఉపయోగకరంగా దోషరహితంగా చేసి.. గృహ నిర్మాణం ప్రారంభించండి.
– రామ్‌కుమార్, మెహదీపట్నం
రెడీమేడ్‌గా బయటనుంచి తెచ్చిన పూజగదికి ఏ నిబంధనలు లేవు. దానిని తూర్పు భాగంలో కిచెన్ గది తరువాత ఏర్పాటు చేసుకొని వాడవచ్చు. ఇంట్లో పూజగది నిర్మాణం చేసినప్పుడు ఆ గదికి పెట్టే ద్వారం ఎత్తు.. అలాగే ఇతర ద్వారాల ఎత్తుతో సమానంగా ఉండాలి.

04
పూజగది ద్వారాలు అందంగా, వెడల్పుగా ఎంత పెట్టుకున్నా కూడా.. ఎత్తును ఇష్టం వచ్చినట్లు పెంచడం తగ్గించడం చేయవద్దు. ఇంటి సింహ ద్వారం తదితర మిగతా ద్వారాల ఎత్తుతో సమానంగా ఉండాలి. బయటనుంచి తెచ్చిన పూజగది పైన గోపురం ఉంటుంది. అది దోషమని అనుకోవద్దు. దైవానికి శోభస్కరం ఉండవచ్చు.
– వాడ సత్యవతి, మిర్యాలగూడ
వ్యవసాయ భూమి శాస్త్రానికి ఉండాలనుకోవడం కరెక్ట్కాదు. సహజంగా అటు పడమర గానీ, దక్షిణం గానీ పల్లంగా మడులు ఉంటాయి. అలా ఉండటాన్ని దోషంగా భావించకూడదు. నిర్మాణాలు వేరు, వ్యవసాయ భూములు వేరు.

నీటి పారకం ఎత్తుపల్లాలను బట్టి అక్కడ బావులు, కాలువలు కూడా ఉంటాయి. నీరు అన్ని మడులకు చేరేలా ఏర్పాటు ఉంటే చాలు. ఎత్తు పల్లాలు పట్టించుకోవాల్సిన పనిలేదు. ఆ వ్యవసాయ ప్రదేశంలో ఉండటానికి స్టాఫ్ క్వార్టర్స్, గోశాలలు, ఇతరత్రా గదులు నిర్మించుకునేటప్పుడు అన్ని విధాలుగా స్థలాన్ని ఎంపిక చేసి, తగు మార్పులు చేసి కట్టుకుంటే సరిపోతుంది. అన్నిటినీ ఒకే దృష్టితో చూడకండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143