– ఆకుల రామాచారి, రాయిగిరి
ఇల్లు కట్టే విధానంలో ‘బ్యాలెన్స్’ అనేది ఒకటి ఉంటుంది. మన ఇంటిలోని ఆవరణం కుటుంబంపై ప్రభావం చూపుతుంది. అందుకే సరి సంఖ్యలో కిటికీలు, ద్వారాలు పెడతారు. ఇల్లు మీద ఇల్లు కట్టినప్పుడు అది ఒక కుటుంబం మాత్రమే వాడుకుంటుంది. దానిలోకి గాలి-వెలుతురు వచ్చేవిధంగా, కొలతలు, దిశలు అనుసంధానం చేస్తూ ప్లాన్ చేయాల్సి ఉంటుంది.
దక్షిణంలో లేదా పశ్చిమంలోనే ఇంటి లోపలి మెట్ల నిర్మాణం చేయాలి. ఇందులో ఎలాంటి మినహాయింపు లేదు. మెట్లు ఎక్కడ వచ్చినా ఒక కటింగ్ ఉంటుంది. అవి కేవలం డాగ్లెగ్ మెట్లు అయి వైడెన్గా తీసుకుంటే.. పెద్ద డబుల్ హైట్ వేస్తుంటారు. ఆపై కటింగ్ వల్ల దక్షిణ లేదా పడమర వైపు గొయ్యి వస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేసేందుకు అభిముఖంగా స్లాబ్ కట్ చేయాలి. అందుకు డబుల్ హైట్ అవసరమవుతుంది. అది లేకుండా చేయొద్దు.
– వీఎల్ రామారావు, హుస్నాబాద్
కింద ఇంటి సింహద్వారం గొయ్యికి ఎదురుగా రాకుండా చూడటం ముఖ్యం. బావి బోరు, ఇతర వాటర్ సంపులు నీటికోసం వాడుతుంటాం. వాటికి ఎదురుగా ద్వారాలు ఉండటం మూలంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది. పైగా గొయ్యి మీద నడవటం కూడా ప్రమాదకరమే కదా. అయితే పైనున్న ఇంటికి నేలతో సంబంధం లేదు. పై అంతస్తులోకి వెళ్లడానికి ఆగ్నేయం, వాయువ్యంలోని మెట్లను మాత్రమే వాడుతాం. వాటికి కిందున్న గోతులు, బోర్లతో ఇబ్బంది ఉండదు. ఈ విషయాన్ని ఇంటి సెంటిమెంట్‌గా భావించకండి. ‘ప్రయోజనం-ప్రమాదం’ అంశాలను శాస్త్రం తప్పక చూస్తుంది. పైన అంతస్తు ప్రకారం దానికి తగిన విధంగా ఉత్తర ఈశాన్యం లేదా తూర్పులో ద్వారాన్ని పెట్టుకోవచ్చు.
– అంబటి శారద, పటాన్చెరు
చిన్నపాటి స్థలమైనా నాలుగు మట్టి గోడలు పెట్టడం వల్ల అది ఇల్లుగా పురుడుపోసుకుంటుంది. ఒక కొత్త జీవికి ఆహ్వానం పలుకుతుంది. చారిత్రక జన్మస్థానం అవుతుంది. కృష్ణుడైనా, కుచేలుడైనా, రాముడైనా వారి తలరాతలకు అది స్థానం అవుతుంది. స్థల మహత్యం వెలుగుచూసేది గోడలలోనే. ఇంటిలో గోడల ప్రయాణం ఎంతో ముఖ్యం. దక్షిణంలో ఆరంభమైన గోడ తూర్పువైపు, పడమరలో మొదలైన గోడ ఉత్తరాన్ని అంటుకోవాలి. మధ్యలో హాల్ వచ్చినా అవుతలి భాగాన్ని పూరిస్తూ ఉండాలి. అన్ని గోడలూ కలిసి మన శరీరంలోని ఎముకల్లా సంపూర్ణ శక్తిని అందిస్తాయి. ఏ గోడ ఎక్కడ ఆగాలి? ఎక్కడ ద్వారం ఇవ్వాలి? ఏ చోట కిటికీలు నిలుపుకోవాలి? అనే విషయాలు జాగ్రత్తగా పాటించాలి. ఇంట్లోని ప్రాణానికి గోడలే ఆధారం. అందుకే ఇష్టానుసారంగా కట్టకుండా తెలుసుకొని కట్టాలి.
– పాలగుమ్మి చంద్రం, యాదాద్రి
ఎలివేషన్ కోసం కిందా, మీదా ఒకేచోట ద్వారాలు పెడుతూ ఉంటారు. అయితే కింద పోర్షన్, పై పోర్షన్ ఒకే విధంగా కట్టుకోవచ్చు. యజమాని కింద ఉండి, పైన రెండు పోర్షన్లు అద్దెకిచ్చినప్పుడు దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అట్లాగే పైన తూర్పులో గ్లాస్ డోర్లు ఏర్పాటు చేసినప్పుడు సైజులో తేడాలు వస్తాయి. ఆ విధంగా కూడా మార్పు కనిపిస్తుంది. ఏదేమైనా పైనా, కిందా ఈశాన్యంలో లేదా తూర్పులోనే ద్వారాలు వచ్చేలా చూడాలి. అంతేకానీ ఆగ్నేయ-వాయవ్యాలలో పెట్టుకోవద్దు. ఈశాన్యంలో ద్వారం పెట్టేటప్పుడు కనీసం తొమ్మిది అంగుళాల స్థలం వదిలి ద్వారం బిగించాలి. అప్పుడే గోడల ప్రయాణం చక్కగా ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143