– సుబ్బారావు, బషీర్‌బాగ్
మన అందరికీ ఈశాన్యం పెంచుకోవాలనే అంశం మెదళ్లలో దూరిపోయింది. ఇది దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తించదు? అనేది తెలుసుకోవాలి. తూర్పు, ఉత్తరంలోని స్థలం ఉత్తర-ఈశాన్యం గానీ.. తూర్పు-ఈశాన్యం గానీ పెరుగుతూ పోయినప్పుడు, దానిని ఎలా స్థిర పరుచుకోవాలో కొలతలను బట్టి సరిచేయాలి. మరీ తోకలాగా ఈశాన్యం పెరిగినా కూడా అమరికలో తేడాలు వస్తాయి. నిర్మాణంలో ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం పెరగవద్దు. మన ముక్కు.. ముఖానికి ఎంత ముందుకు రావాలో అంతే రావాలి.
మరీ వేలాడినట్టు రావొద్దు కదా. అలా కొలతలను బట్టి ఇంటి నిర్మాణపు రేషియోతో దానిని నేలమీద స్థిరం చేయాలి. మీరు పెంచిన ఈశాన్యం స్లాబ్‌ను అలాగే బయటికి వదిలి ఆ దిక్కుల్లో నిటారుగా, సరళంగా గోడలు కట్టాలి. ఆ భవనం తూర్పు, ఉత్తరం.. చతురస్ర కోణంగా కాకుండా నిర్మించండి. అద్దాలు కాకుండా గోడలు కట్టి పెద్ద కిటికీలు పెట్టండి.
– కాలె శ్రీధర్, వరంగల్
పైనుంచి వేలాడే వాటిమీద గురత్వాకర్షణ శక్తి ఉంటుంది. కింది నుంచి పైన ఆగిపోయిన వాటితో ఎలాంటి పోటూ ఉండదు. ఇంటి నిర్మాణంలో ఈ అపసవ్యతలు ఎన్నున్నాయి? అనేది మాత్రం కౌంటు అవుతాయి. ఇల్లు ప్రాక్టికల్‌గా ప్రారంభం కాకముందే.. విజువల్ థింకింగ్‌తో అంచనా వేసుకోవాలి. అప్పుడే కొట్టివేతలు ఉండవు. మీరు చేసిన నిర్మాణంలో సరైన విధానంగా పిల్లర్లు ప్లాన్ చేయకుండా కట్టేశారు. పిల్లర్లు వేశాకే పైన ఇంకో గది వేయాలన్న ఆలోచన మీకు తట్టింది. ఇంటికి కావాల్సిన లోడింగ్‌ను సరిగ్గా బేరీజు వేసుకొని పిల్లర్లను డమ్మీ చేసుకోవచ్చు. కానీ, స్లాబ్ మీద పిల్లర్లను మాత్రం డమ్మీ చేయొద్దు. వాటికి దిమ్మెలు కట్టి పెట్టాల్సిందే.
– నీలం వసుంధర, ఖమ్మం
ఇంటి ద్వారాలు మన రాకపోకలను నియంత్రిస్తుంటాయి. అవి ఎక్కడ, ఎన్ని, ఎంత సైజ్‌లో పెట్టాలన్నది ముందే నిర్ణయించుకోవాలి. మీది డూప్లెక్స్ ఇల్లు కాబట్టి ఫ్లోర్లు ఎన్ని వేసినా అన్నింటికీ తూర్పు-ఉత్తరం ద్వారాలు తప్పక రావాలి. ఆ దిశలకు బాల్కానీలు కూడా ఉండాలన్నది శాస్త్ర నిర్ణయం. మీరు ఒక ఫ్లోర్లో తూర్పువైపున రెండు ద్వారాలు, మరో ఫ్లోర్లో ఒకటి పెట్టారు. ఆ పెట్టిన స్థానాలు నీచ దిశలో కాకుండా చూసుకోవాలి. ప్రతి ఫ్లోర్‌కు తూర్పు ఒక్కటైనా వస్తే చాలు.
– మైనం కృష్ణ, జనగామ
‘నీళ్ల ట్యాంకును అధిక లోడ్ చేసుకోవడం మంచిది కాదు’ అన్న ఆలోచనలో సింథటిక్ ట్యాంకులు వచ్చాయి. ఏ ట్యాంకు పెట్టుకోవాలనుకున్నా దక్షిణ-నైరుతిలో బీములు ఉన్న చోట.. నాలుగు సిమెంటు దిమ్మెలను కనీసం ఒకటిన్నర అడుగులు ఎత్తుకట్టి, దానిమీద సిమెంట్ బిళ్ల వేసుకొని ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి. సిమెంట్ హౌజ్ కట్టాలనుకుంటే కూడా సరైన పిల్లర్ల లోడు చూసుకోవాలి. స్లాబ్‌ను అంటుకోకుండా దిమ్మెలు వేసి దానిమీద ట్యాంకును కట్టుకోండి. కింద పడకగది రెండో భాగం వరకు వైశాల్యం తీసుకొని అవసరం మేరకు నీళ్ల ట్యాంకు నిర్మాణం చేసుకోండి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143