– సి.హెచ్. శ్రీదేవి, నిడికొండ.
మాస్టర్ బెడ్రూం ఎప్పుడూ కూడా పశ్చిమానికి గానీ, దక్షిణానికి గానీ పెరగకూడదు. చాలామంది పశ్చిమ-వాయవ్యంలో కార్ పార్కింగ్ ఇచ్చి.. మధ్యలో డోర్ ఇచ్చి.. పడమర-నైరుతి రెండు లేదా మూడు అడుగులు పెంచి.. మాస్టర్ బెడ్రూం కడుతున్నారు. ఇది చాలా పెద్దదోషం. కొలతలు సరిగ్గా లేకుండా ఈ ఇండ్లు కడితే.. ఆకస్మిక నష్టాలు తలెత్తుతాయి. కిందాపైనా కూడా ఇలా పెంచవద్దు. మిగతా పడమర-వాయవ్యం అంతా బాల్కనీ ఉంది కదా! అని సమాధానం చెప్తుంటారు.
అదికాదు. ఇంటిలోని కార్పెట్ ఏరియా.. నైరుతి పెరగకుండా ఉండాలి. బాల్కనీలు ఇంటి లోపలి భాగంలోకి రావు. ఇలాంటి ఇండ్లను నైరుతి పెరిగిన బెడ్రూంలను కట్‌చేసి.. సరిచేయాలి. లేదా పశ్చిమం-వాయవ్యం బాల్కనీ భాగం అంతా ఇంటిలోకి కలుపుకోవాలి. పడమర సమానం చేయాలి. బాల్కనీ అనేది ఇంటి బయటికి పూర్తిగా ఉత్తర-దక్షిణాలు కలుపుతూ ఉండాలి. మీరు వెంటనే ఇంటిని సవరించుకోండి. అలా ఉండొద్దు.
– జి. భిక్షం, షాద్‌నగర్.
గ్రాండ్‌గా కనిపించాలని రోడ్డువైపు షాపులకు డబుల్హైట్ ఇస్తుంటారు. ఇది ఇటీవల చాలామంది ఫాలో అవుతున్నారు. కానీ, దక్షిణం, పడమర వీధులు వచ్చినప్పుడు అది దోషం అవుతుంది. ఆ ఎత్తు స్లాబు దక్షిణంలో వేయాలి అనుకుంటే.. అందుకు బ్యాలెన్స్ చేసేలా ఉత్తరంవైపు కూడా డబుల్ హైట్ చేయాల్సి వస్తుంది. తూర్పు చేయవద్దు. రోడ్డు దక్షిణం కాబట్టి, ఉత్తరమే చేయాలి. ఉత్తరంలో వచ్చే డబుల్ హైట్‌ను ఈశాన్యం కట్ అవ్వకుండా అటు నడక వచ్చేలా.. ఉత్తరంలోని బాల్కనీకి వెళ్లేలా.. ద్వారం పెట్టేచోటు ఉండాలి. అంటే షాపు లోపల ఉత్తరం-ఈశాన్యం తిరిగేలా హోల్ (డబుల్ హైట్) చేయాలి. లేదా దక్షిణం-ఆగ్నేయంలో పెద్ద ఎంట్రెన్స్ పెట్టుకొని, లోపల తూర్పు భాగం మొత్తం డబుల్ హైట్ చేసుకొని, పడమర భాగం అటు నైరుతి నుంచి వాయవ్యం వరకు స్లాబు (మెజనైన్) వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది.
– వై. మణిగోపాల్, ఖమ్మం.
సాధారణంగా సింహద్వారం ఉన్నవైపున మాత్రం వాలు వరండా వేస్తుంటారు. మనదేశం ఉష్ణమండలం కాబట్టి.. తూర్పు-ఉత్తరాల గృహాలకు వాలు వరండాలు వేయడం అవసరం. కారణం.. మధ్యాహ్న సమాయానికి తూర్పు-ఉత్తరంవైపున ఎండ తీవ్రత నుంచి ఇంటిని కాపాడటానికి అది ఎంతో దోహదం చేస్తుంది. పడమర వైపు కూడా వరండాలు వేస్తారు. పగలు, సాయంకాలం వేళ వరండా నీడనిచ్చి, చల్లగా ఉంచుతుంది. అయితే, వాస్తుపరంగా ప్రధాన ద్వారం ఉన్నప్పుడు అది పడమర దిశ అయితే.. తూర్పు వైపుకూడా వరండా వేసుకోవాలి. దక్షిణంలో వరండా ఉంటే.. ఉత్తరంలో కూడా వరండా వేయాలి. కానీ, తూర్పు-దక్షిణాల్లో, ఉత్తరం-పడమరల్లో వరండాలు వేయవద్దు. తద్వారా విరుద్ధ దిశలకు వరండాలు వస్తాయి. అయితే, నాలుగు దిశలకు కూడా వాలు వరండాలు వేసుకోవచ్చు. దోషంలేదు.
– బి. వీరన్న, మీర్‌పేట.
వృక్షాలు ఎక్కడ పెంచుకోవాలి? అనేది ప్రధాన చర్చ. కానీ, ఇంటి చుట్టూ గార్డెనింగ్, పూల మొక్కలు చక్కగా తప్పకుండా పెంచుకోవాలి. పచ్చదనం లేని ఇండ్లు ప్రశాంతతకు నోచుకోవు. మనిషి ప్రకృతికి దాసుడు. ఎంత వీలైతే అంతగా.. తోటల్లో, నేలమీద చెట్లను పెంచుకోవాలి. ముఖ్యంగా, తూర్పులో -ఉత్తరం ఇంటిని మూసివేసే.. ఇంటి తూర్పు-ఈశాన్యంలో సూర్యుని వెలుగును అడ్డుకునే వృక్షాలు పెంచకూడదు. ఇల్లంతా మూసి, కప్పుగా చేసే తీగల చెట్లు పెంచవద్దు.
కారణం.. ఇంటికి అవసరమైన విటమిన్-డి.. సూర్యరశ్మి ఉదయం పూటనే అందుకుంటాం. దానిని నిరోధించే చెట్లు.. ఆ దిశల్లో పెంచకూడదు అనేది నియమం. ప్రహరీ దాటని పూల మొక్కలను తూర్పు-ఉత్తరంలో చక్కగా పెంచుకోవచ్చు. ఇంటిలో ఎక్కడైనా మహా వృక్షాలు, చింత, రావి, జువ్వి, మర్రి. జిల్లేడు చెట్లను పెంచవద్దు. అవి పొలాల వద్ద, ఇతర వ్యవసాయ స్థలాల్లో పెంచుకోవాలి.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143