– బి. చంద్రకళ, ఉప్పల్.
తప్పకుండా కట్టుకోవచ్చు. మీకున్న వీధిని బట్టి, మీకు తప్పకుండా పశ్చిమ సింహద్వారం రావాల్సి ఉంటుంది. ప్రతి ఇంటికి అది ఏ దిశ సింహద్వారం ఇల్లు అయినా.. తూర్పు వైపు – ఉత్తరం వైపు ప్రధాన ద్వారాలు పెట్టాల్సి వస్తుంది. ఆ విధంగా మీ గృహానికి మూడు సింహద్వారాలు అవుతాయి. తప్పుకాదు. ‘మూడు పెట్టకూడదు’ అనేది లేదు. ఒక్కో దిశకు ఒక్కో ద్వారంగా పెడుతున్నాం. ఇలా దిశలు మారుతూ ఉన్నప్పుడు లెక్క మూడు అనేది రాదు. ఒకే దిశకు, ఒక వైపు చూసే మూడు ద్వారాలు పనికిరావు. అయితే, ఈ మూడు సింహద్వారాలు కవల పిల్లల్లాగా ఒకే వెడల్పు, ఎత్తు కలిగినవి పెట్టాల్సి ఉంటుంది.
– కె. అనుపమ, కుకునూర్‌పల్లి.
గచ్చు ఇల్లు అంటేనే.. ఇంటి మధ్యలో ఆకాశస్థానం అంటే, ‘ఓపెన్ టూ స్కై’ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పుడే అది బ్రహ్మస్థానంగా నిలబడుతుంది. తద్వారా ఇంటిలో దినమంతా ఏ చోటా చీకటి నిలవదు. పూర్తిగా వెలుతురుతో నిండి ఉంటుంది. దీనినే గచ్చు ఇల్లు – చతుశ్శాల అంటారు. ఇక సరిగ్గా ఇంటి మధ్యలో గర్భస్థానంలో నీరు పడిపోవడం కోసం గచ్చు (గుంత) కడతారు. కానీ, మీరు అడిగిన దానిని బట్టి పైన గ్లాస్ పెడితే.. కింద గచ్చు అనవసరం. సాధారణ ఫ్లోరింగ్ వేసుకోండి. హౌజులాగా గచ్చు నేల అక్కరలేదు. పైనుంచి పడే నీటికి అనుబంధంగానే గచ్చు అవసరం అవుతుంది. నీరు పడనప్పుడు గచ్చు వద్దు.
– కె. పాండురంగారావు, చౌటుప్పల్.
ఆపో బ్రహ్మేతి వ్యజానాత్ అంటారు. నీరు లభించే చోటును దేవాలయంగా భావించాలి. పైగా మీది పాఠశాల.. గృహం కాదు. విద్యా ప్రాంగణాలలో, ఆసుపత్రులలో, ఆలయ క్షేత్రాలలో, వ్యవసాయ క్షేత్రంలో, ధర్మ సత్రాలలో, మఠాల్లో, బస్‌స్టాండ్ – బస్‌డిపోల్లో, రైల్వే స్టేషన్లలో.. నీరు లభ్యతను మాత్రమే చూడాలి. వాటి స్థానాన్ని లెక్కించకూడదు. ప్రజోపయోగ కార్యాలయాల్లో ఏ నియమం ఉండదు. అంటే.. ప్రాణాధార ప్రకృతి నిధులను అపసవ్య స్థితుల నుంచి కూడా స్వీకరించవచ్చు. దోషం కాదు. మీరు మీ బోరును కంటిన్యూ చేస్తూ.. మీ విద్యా ప్రాంగణాన్ని పచ్చదనంతో నింపండి. విద్యార్థులను ప్రజ్ఞావంతులుగా తయారుచేయండి. మీకు శుభం కలుగుతుంది.
– ఎం. వెంకట్, గజ్వేల్.
పవిత్రత వేరు.. దాని వాడకం వేరు. గర్భగుడి ఎంతో పవిత్రమైనది. కానీ, దానిని పడక గదిగా వాడలేం కదా! దేవుడి దీపం పవిత్రమైనది.. దానితో బీడి వెలిగించుకోరు కదా! శ్మశానభూమి పవిత్రత పరమశివుడిది. అక్కడ అన్నీ సమస్థితిలో చూడబడతాయి. పేద – పెద్ద తేడా లేకుండా కార్యకలాపాలు నడుస్తాయి. అందరూ చివరికి అయ్యేది బూడిదే! ఆ తత్వం వేరు. దానికి దగ్గరగా, దానిని ఆనుకొని గృహం నిర్మించడం.. అందులో జీవించడం వేరు. అది ఎంతమాత్రం సరికాదు. కుటుంబ వ్యవస్థలో ప్రమాణాలు వేరు. శవాలను కాల్చేటప్పుడు ఆ వాతావరణం పొల్యూషన్ అవుతుంది. దానిలో జరిగే కర్మకాండలు చూస్తూ పిల్లలు పరీక్షలకు పాఠాలు చదువలేరు. స్త్రీలు తమ నిత్యవిధులను నిర్వర్తించలేరు. ఆక్రందనల చోట.. ఆనంద నిలయం విరుద్ధ బావనలు సృష్టిస్తుంది. ఇల్లు అంటే కేవలం నీడ కోసం కాదు. జీవన వైభవం కోసం. కుటుంబ వికాసం కోసం అనేది మరువకూడదు.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678