– వి. తులసి, ఖమ్మం.
అరటి బోదె.. జ్ఞానానికి ప్రతీక. అరటి చెట్టు పవిత్రమైనది. పూజార్హమైనది. దానిని తోటల్లో మహా భక్తితో పెంచుతారు. అరటి ఆకు భోజనంపైనా ఎన్నో శాస్త్ర ప్రవచనాలు ఉన్నాయి. ఇంక అరటి ఫలం గురించి చెప్పనే అక్కర్లేదు. అన్ని కాలాల్లో దొరికే అమృత ఫలం అది. ఇంటి ఆవరణలో దీనిని పెంచకుండా.. పెరటిలోనే పెంచడానికి కారణం ఒక్కటే! ఒక అరటి చెట్టు తన జీవితకాలంలో ఒక గెలను, దానితోపాటు ఒక అరటి మొక్క (బిడ్డ)ను మాత్రమే ఇచ్చి.. అది నేలకూలుతుంది.
– కె. ప్రభాకర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు.
వ్యాపార స్థలాన్ని మల్టీపుల్‌గా నిర్మాణం చేయాలి అంటే.. ఎప్పుడైనా నేలమీది భాగం వ్యాపారానికి, పైభాగం నివాసానికి కేటాయించాలి. రెండు కిందనే చేయకూడదు. అవి కుదరవు. మంచిది కాదు కూడా! రోడ్డువైపు కాంపౌండు వదిలి, నిర్మాణం చుట్టూ కనీసం నాలుగు – ఆరు అడుగుల వెడల్పు స్థలాన్ని శాస్త్రప్రకారం ఆయా దిశలకు వదిలి.. నిర్మాణ స్థలాన్ని ముందుగా నిర్ణయించాలి. ఇల్లు – కమర్షియల్ ఏక స్థలంలో ఉండాలి కాబట్టి.. చుట్టూ ఖాళీ తప్పనిసరి. ముఖ్యంగా.. హద్దులమీద నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు.
లిఫ్ట్ – మెట్లు ఆగ్నేయం లేదా వాయవ్యంలో కేటాయించి, కింది ఫ్లోర్‌ను అవసరమైన ఎత్తు పెంచుకోవచ్చు. అందుకు తగిన బీములు, పిల్లర్స్ సరిగ్గా ప్లాన్ చేసుకొని కింది ఫ్లోర్‌ను వదిలి.. పైన పన్నెండు అడుగులు లేదా స్లాబ్ కలిపి పదకొండు అడుగులు కూడా వేసుకోవచ్చు. ఇంటికి సపరేటు గేటు పెట్టుకొని వాడుకోవడం మంచిది. షాపులో నుంచి లిఫ్ట్, మెట్లు వేయకూడదు. వాటిని బయటినుంచే ప్లాన్ చేసుకోవాలి. పైన ఇంటిని హాల్, కిచెన్, పడక గదులతో సరిగ్గా విభజన చేసి కట్టుకోవాలి.
– బి. రాజు, ఈసీఐఎల్.
కొందరు బ్యాంకర్లు వాళ్ల సొంత ప్రణాళికతో ఒక విధానాన్ని అవలంబిస్తూ ఉంటారు. కానీ, ఆ పద్ధతి శాస్త్రం ఆమోదించేదిగా ఉండదు. మీరు సరిగ్గా వాస్తుబద్ధంగా చేయాలని కోరుకుంటే.. దిశ ఏదైనా, రోడ్డు ఎటు ఉన్నా.. సరైన స్థానంలో ద్వారాలు పెట్టుకోండి. స్ట్రాంగ్ రూమ్ బరువు ఉంటుంది. డబ్బు ప్రధానం కదా!? అనుకొని నైరుతిలో పెట్టకూడదు. నైరుతి స్థానం బ్యాంకు మేనేజర్‌దే! సరిగ్గా ఆలోచించుకోండి. యజమాని కన్నా ఏదీ ముఖ్యం కాదు.
ప్రయాణంలో కారు నడిపేవాళ్లే ముఖ్యం.. కారు కొన్నవాళ్లు కాదు. బ్యాంక్ బాగోగులు చూసేవారే ముఖ్యం.. డబ్బు స్థానం ప్రధానం కాదు. స్ట్రాంగ్ రూమును దక్షిణంలో లేదా పశ్చిమంలో పెట్టుకోవాలి. హాలును తూర్పు లేదా ఉత్తరంలో కేటాయించాలి. జనానికి అభిముఖంగా, విశాలంగా స్టాఫ్ సీట్లను అమర్చాలి. ఇరుకు లేకుండా ఉండాలి. టాయిలెట్లు ఆగ్నేయం లేదా వాయవ్యంలో పెట్టాలి. తద్వారా బ్యాంకు మంచి ఉన్నతిలో ఉంటుంది.
అంటే.. తను పోతూ తన సంతానాన్ని, తన ఫలాన్నీ ఇస్తుంది. అందుకు తగిన స్థలం కూడా అవసరం. ఇందుకు కారణంగా.. అరటి చెట్టును పెరడులోనే పెంచుతారు. ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా, అనేక కార్యకలాపాలతో ఉంటాయి కాబట్టి, ఇంటి ముందర ఈ చెట్టును పెంచరు. అలాగే ఒకే బిడ్డను ఇస్తుంది అనే సెంటిమెంట్ కూడా ఒక కారణమే. అంతేకానీ, అరటి చెట్టును పెంచడం వల్ల ఎవరికీ ఏ కీడూ జరగదు. అలా అనుకుంటే.. అరటి తోటలు ఎలా నిలుస్తాయి?
– ఎం. కళమ్మ, షాద్‌నగర్.
వ్యాపార స్థలంలో తప్ప.. ఇంటి భాగంలో ఇంట్లో బోర్లు, బావులు వేయకూడదు. వాటి వాడకంలో ఇబ్బందులు వస్తాయి. పాత ఇల్లు అంటున్నారు. బయట స్థలం ఖాళీగా లేదు అంటున్నారు. అంటే మీ ఇల్లు హద్దులమీద ఉందని అర్థం అవుతున్నది. అలా అయితే.. తూర్పు – ఉత్తరం ఓపెన్ చేయండి. అంతేకానీ, ఇంట్లో బోర్ వేయాలనే ఆలోచన వద్దు. సర్దుకుపోదాం అనే భావన నిర్మాణరంగంలో పనికిరాదు. ఇంటి చుట్టూ ఖాళీ లేకపోయినా.. కనీసం తూర్పు – ఉత్తరం చాలా ముఖ్యం.
అప్పుడే ఆ ఇల్లు వాడుకోవడానికి బాగుంటుంది. మీరు కూడా బాగుండాలి కదా! బావి, బోరింగ్ ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తరంలో రావాలి. అందుకు ఓపెన్ ప్లేస్ ఉంటేనే.. అది సూర్యరశ్మి ద్వారా శుద్ధి అవుతుంది. నీళ్లు వచ్చే భూమిలో ఏ మూల తవ్వినా నీళ్లు పడుతాయి. కానీ, అవి సూర్యుని కనుసన్నల్లో ఉండే స్థానం ముఖ్యం. అందుకు తూర్పు – ఈశాన్యం – ఉత్తరం.. ఈ దిశల్లో బావి ఎక్కడైనా ఒక్కటే!
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143