– ఉమాపతి, ప్రగతినగర్
ఏ దేశానికైనా కొన్ని నిర్మాణ పద్ధతులున్నాయి. అవి ఆయా దేశాల సంప్రదాయాలు, వాతావరణ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. అన్ని దేశాల్లోనూ పంచ భూతాలుంటాయి. ఈ భూమి మీద వ్యక్తి నిర్మాణం ఒక్కటే అయినా ఆయా దేశాల్లో జీవన విధానం, అలవాట్లు మాత్రం వేరువేరుగానే ఉంటాయి. కానీ ఇంటి నిర్మాణానికి ఎక్కడైనా కొన్ని మౌలిక సూత్రాలు సర్వసాధారణంగా పాటించాల్సి వస్తుంది. అవి మీ ఇండ్లకు ఉన్నాయా లేదా అనేది పరీక్షించాలి. ప్రధానంగా ద్వారాలు, దిశలు, ఇంటి విభజన వంటివి ఎలా ఉన్నాయనేది తెలుసుకోండి. మన దేశం విడిచిపెట్టి వెళ్లినప్పుడు విదేశాల విధానాలకు అలవాటు పడి బతకాల్సిందే కదా!
– సీవీఎల్ భారతి, ఉప్పల్
చాలా అపార్ట్మెంట్లలో ఉత్తరం మధ్యలో, తూర్పు మధ్యలో జంట మరుగుదొడ్లు నిర్మిస్తుంటారు. ఒకరిని చూసి మరొకరు ఇలా దైవస్థానంలో మరుగుదొడ్లు నిర్మించి.. వాటికి సంబంధించిన ఇండ్లలో ఉండేవారిని అనారోగ్యాలకు గురిచేస్తున్నారు. మీరు వాటిని మార్చాలనుకుంటే వెంటనే ఉత్తర వాయవ్యంలోకి గానీ, పడమరలో గానీ, దక్షిణంలో గానీ నిర్మించండి. మరుగుదొడ్లను తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలలో నిర్మించకూడదు. మీరు ఉండేది అపార్ట్మెంట్లో అయితే.. వెంటనే మారండి. ఉత్తరంలో టాయిలెట్లు ఉంటే ప్రధానంగా ఇంట్లోని స్త్రీలు, ఆడపిల్లల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది.
– కట్టా యాదగిరి, మోత్కూర్
మీ స్థలాన్ని నైరుతి భాగంలోని స్థలమంటారు. అది ఎంతో కీలకమైన స్థలం. అక్కడ ఇల్లు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. మీ ప్లాన్ ప్రకారం నైరుతిలో రోడ్డు రౌండ్గా తిరిగి.. అటు ఆగ్నేయం, ఇటు వాయవ్యం పెరిగింది. ముందుగా ఆ రోడ్డుకు ఎంతదూరం ఇల్లు ఉండాలో, రోడ్డుకు స్థలమెంత వదలాలో వదిలి.. దాన్ని మూలమట్టం చేసుకోవాలి. నిర్మించే స్థలంలో దక్షిణం కాంపౌండ్ నిర్మించి, పడమర వాయవ్యంలో గేటు పెట్టుకొని.. లోపల శాస్త్రపరంగా గృహ నిర్మాణం ప్లాన్ చేసుకోవాలి. తూర్పు, ఉత్తరాలలో ఎక్కువ ఖాళీ స్థలం వదిలి ఇల్లు కట్టండి. పెరిగిన ఆగ్నేయ-వాయవ్య భాగాలను రోడ్డుకు వదిలి, పశ్చిమ సింహ ద్వారంతో ఇంటిని నిర్మించండి.
– కదిరె శ్రీలక్ష్మి, చాడ
నిజానికి మెట్లు ప్లాన్ చేయకుండా ఇంటి నిర్మాణం చేయకూడదు. ఉత్తర వాయవ్యంలోని ఇంటి మూలలో ఇంటిని కట్ చేసి మెట్లు వేసుకోవాలి. లేదా తూర్పు ఆగ్నేయంలో ఇంటిని కట్ చేసి మెట్లు వేసుకోవచ్చు. మీ ఇల్లు తూర్పు-పడమర పొడవు కలిగి దీర్ఘచతురస్రంగా ఉంది. కాబట్టి ఉత్తర వాయవ్యంలో గదిని కట్చేసి అందులో దక్షిణ ముఖంగా ఎక్కి.. ల్యాండింగ్ తీసుకొని, తూర్పున మరో ల్యాండింగ్ తీసుకొని.. ఉత్తరం వైపు పశ్చిమ ముఖంగా మేడమీదకు పడమర బాల్కనీ నుంచి వెళ్లవచ్చు. అన్ని రకాలుగా బీములు చూసుకొని జాగ్రత్తగా నిర్మించుకోవాలి. పడమర బాల్కనీ ఉన్నప్పుడు తూర్పు బాల్కనీ కూడా వేయాల్సి ఉంటుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143