– బి. దాశరథి, చెర్లపల్లి.
మీరు దేనిని కలిసిరావాలని అనుకుంటున్నారు? డబ్బునా? పదవినా? హోదానా? మీరు చేసే వ్యాపారాన్నా?.. ఇవి ఏవీ శాస్ర్తానికి సంబంధించినవి కావు. శాస్త్రం ఉద్దేశం వేరు. మీ కోరికల లిస్టు వేరు. ఎందుకంటే.. మీకుండే కోరిక మరొకరికి ఉండకపోవచ్చు. మీకు ఇష్టమైనది ఇంకొకరికి ఇష్టం కాకపోవచ్చు. ఎందరు వ్యక్తులు.. ఎన్ని ఆలోచనలు. ఒక్కరికోసం, ఒక్కరి మనుగడ కోసం.. ఒక్క డబ్బుకోసం అంటూ ఒకచోట ఆగిపోయే దానిని శాస్త్రం అనడం చాలాతప్పు. వ్యక్తి ముందుగా వికాసం చెందాలి. అతను.. అతనికి అర్థం కావాలి. పని – పక్కనే ఫలితం ఉంటుంది. ఏ పనిని బట్టి ఆ ఫలితం తప్పక వస్తుంది.
కలిసి రావడం అంటే.. మన అర్హత, మన నిజాయతీ, మన శ్రమ, మన జ్ఞానం (బుద్ధి), మన ప్రయత్నం.. ఇవి ముందు ఉండాలి. ఆ తరువాత ప్రకృతి సహకారం అనే శాస్త్ర అంతరంగం మనకు వేయివిధాలుగా తోడ్పడుతుంది. వంట చేయడానికి మంట ఉండాలి. ఆ మంటకు దైవకృప.. అంటే, నేచర్ సపోర్ట్ చాలా అవసరం. అద్భుతమైన కారు ఉంది. గొప్ప హైవే ఉంది.
చక్కని డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి. దారిలో వెళ్తుంటే ఒక్కసారిగా తుఫాను – భారీ వర్షం – పిడుగులు – బీభత్సం ఉంటే.. ఏంటి పరిస్థితి? అప్పుడు నడక సాగుతుందా? ఇక్కడ వ్యక్తి ఉన్నాడా? మన మేధాశక్తికి కాలం అనుకూలం కావాలి. ఇది ప్రకృతి చట్టానికి పరిమితం. ఒక నియమం సృష్టిలో ఉంది. అంటే.. ఒక నియంత (రాజకీయపరమైన భావన కాదు) ఉన్నాడు విశ్వానికి. ఆయన చట్టపరిధిలో మన వ్యక్తిత్వం, మన గృహం ఉన్నప్పుడే విజయం! పట్టాలు తప్పనంత వరకే రైలు పరుగు. వ్యక్తిగత ధర్మం – కృషి ఉన్నంత వరకే కలిసి రావడం.
– ఎన్. రవీంద్ర, ఉప్పల్.
ఎదుటివారి ఇంటిని మన హద్దుగా భావించకూడదు. అది వారి సొంతం. ఒక్కోసారి వాళ్ల ఇంటికి మన తూర్పు.. పడమర అవుతుంది. కాబట్టి, వాళ్లు కాంపౌండు కూడా కట్టకపోవచ్చు. అలాంటప్పుడు వారి ఇంటినుంచి వచ్చేవన్నీ మన ఇంటికే చెందుతాయి. ఒక ఇల్లు తన నిత్యవాడకంతో ఎంతో కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంది. పోతే.. వాళ్లవాళ్ల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో తెలియదు. అలా ఒక ఇంటి విధానం మన తూర్పును కలుషితం చేస్తుంది.
తద్వారా మన ఇంటి వాతావరణం అనారోగ్యంగా మారుతుంది. కాబట్టి, ఎవరి హద్దులు వాళ్లు నిర్మించుకోవాలి. మీరు మీ ఇంటి హద్దును బట్టి కనీసం ఆరు అడుగులు ఎత్తు ఉండేలా కాంపౌండును కట్టండి. రెండు ఇండ్ల ప్రహరీల మధ్య స్థలం వదలాలి. అదికూడా మూడు అడుగులు. అయితే, వాళ్ల ఇల్లే వాళ్ల హద్దుమీద కట్టి ఉంటే.. మీరు కూడా మీ హద్దుమీదే కట్టండి. దానివల్ల మన హద్దులతో మన గృహం.. మన వాతావరణంలో ఉంటుంది.
– బి. రవి, తేరాల.
అది చక్కని వ్యాపార స్థలం. దిశలు లేని స్థలానికి భూమి బలం యాభై శాతమే ఉంటుంది. మీరు ఉత్తరం ముఖంగా అనుకునే ఆ దిశ.. మీకు ఈశాన్యం అవుతుంది. ఇలాంటి విదిక్కులు వచ్చినప్పుడు మీరు అనుకునే ఉత్తరం (ఈశాన్యం)లో రోడ్డు ఉంటే.. చాలా మంచిది. అలాగని గృహానికి అనుకూలం కాదు. ఏదైనా ఆఫీస్‌కు కానీ, వ్యాపార స్థలంగా కానీ చక్కగా వాడుకోవచ్చు. చాలా ప్రయోజనకర ఫలితాలు ఇస్తుంది. అలాంటివి ఎన్నోచోట్ల యోగిస్తున్నాయి.
విదిక్కుల స్థలాల్లో నిర్మాణం చేసినప్పుడు దానికి విధివిధానాలు వేరుగా ఉంటాయి. సంపులు, బోర్లు, సెప్టిక్ ట్యాంక్, ఖాళీ స్థలం వదిలే విధానం, ఆఫీస్ అయితే కూర్చునే పద్ధతి.. అవన్నీ తెలుసుకొని నిర్మాణం చేపట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు.. కాని దిశను తూర్పు అని, ఉత్తరం అని నిర్మాణం చేయకండి. దేనిని ఎలా కడితే బాగుంటుందో అలాగే కట్టాలి.
– కె. చంద్రయ్య, ఆలేరు.
ఎంత వ్యాపారమైనా దేని ప్రాముఖ్యం దానిదే కదా! ఇల్లు ఈశాన్యంలో బరువు వేయకూడదు అంటే.. ఆ దిశను మూయకూడదు అని అర్థం. ఇంటిలో ఎన్నో అవసరాలు ఉండొచ్చు. కొందరు అనేక వస్తువులు పెడతారు. తద్వారా అవి ఆ స్థానాన్ని కప్పేస్తాయి. అయితే, ఈశాన్యం వెలుగుతో ఉండాలి. తూర్పు – ఉత్తరాలకు ద్వారాలు, కిటికీలు పెద్దగా పెట్టడంలో ఉద్దేశం కూడా అదే! అది ఎక్కువ ఉదయపు కాంతి వచ్చేందుకు అనుకూలం. దానిని ఏవో బస్తాలు, డబ్బాలు పెట్టి కప్పకూడదు.
అసలు మీ ఇల్లు పడమర వీధి ఇల్లా? తూర్పు వీధి ఇల్లా? అనేది తెలపలేదు. తూర్పు వ్యాపార గృహం అయితే.. ఈశాన్యంలోనే షట్టర్లు, ద్వారాలు ఉంటాయి. అప్పుడు మూసే అవకాశమే రాదు. ఇంట్లో కానీ, షాపులో కానీ నైరుతి – ఆగ్నేయం – వాయవ్యం – దక్షిణ – పడమర దిశలు వస్తుసామగ్రితో నింపుకోండి. తూర్పు – ఉత్తర – ఈశాన్యాలను నింపకండి. ఇంటికి అవి శ్వాస నాళాలు.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143