Vasthu Shastra | ఏదైనా వరం కావాలని దేవుడిని గుడిలోనే ప్రార్థించాలా? ఇంట్లో కోరుకోకూడదా?
Vasthu Shastra | ఏదైనా వరం కావాలని దేవుడిని ఇంట్లో కోరుకోకూడదా? గుడిలోనే ప్రార్థించాలా? మనిషి తనకు ఏదైనా కావాలంటే.. పరమాత్మను కాకుండాఎవరిని కోరగలడు? మనుషులందరికీ ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి,
Vasthu Shastra | ఏదైనా వరం కావాలని దేవుడిని ఇంట్లో కోరుకోకూడదా? గుడిలోనే ప్రార్థించాలా?
– కె. సరస్వతి, బాసర
మనిషి తనకు ఏదైనా కావాలంటే.. పరమాత్మను కాకుండాఎవరిని కోరగలడు? మనుషులందరికీ ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి, ఉంటాయి కూడా! భగవంతుణ్ని కోరడం తప్పుకాదు. అది ఇంట్లో కోరినా, గుడిలో కోరినా దోషం కాదు. కానీ, గృహంలో కోరడంకంటే.. గుడికి వెళ్లి కోరడం వల్ల ప్రాధాన్యం పెరుగుతుంది. ఒక పని కావాలని మిత్రుణ్ని ఫోన్లోఅడగడానికి, ఇంటికి వెళ్లి అడగడానికి తేడా ఉంటుంది కదా! స్థానంలో ఇల్లు గొప్పదే అయినా.. గుడికి ఎప్పుడూ సాటిరాదు. ఇకపోతే, అడగడం అంటే లిస్ట్ పెట్టడం కాదు. మనకు ఏది అవసరమో భగవంతుడికి తెలియకుండా ఉండదు. పసివాడికి మాటలు రాకున్నా.. అమ్మ వాడి అవసరాలను తెలుసుకొని తీరుస్తుంది. దైవం కూడా అంతే. ‘నీకు అన్నీ తెలుసు. నీ సంకల్పానుసారం నన్ను పోషించు!’ అని కోరితే చాలు.

వంటగదిలో రెండు సింకులు ఉండొచ్చా? యుటిలిటీ (గిన్నెలు కడిగే గచ్చు) ఎక్కడ పెట్టాలి?
– శ్రీలత, కరీంనగర్
ఇప్పుడు రెండు వంటగదులు కడుతున్నారు. ఆ నిర్ణయంతో తప్పకుండా ఇంట్లో రెండు సింకులు వస్తాయి. నిజానికి మీరు రెండు గదులు వేరుచేసి.. ఒకటి వెట్ కిచెన్, ఇంకోటి డ్రై కిచెన్‌గా చేసుకుంటే, రెండు సింకులు పెట్టుకోండి. లేదా ఒకే ప్లాట్‌ఫామ్‌కు దాని ఈశాన్యంలో ఒకే పెద్ద సింకు పెట్టుకుంటే మంచిది. ఎలాగూ యుటిలిటీ ఉంటుంది. అందులో కూడా సింకు పెద్దదిగా పెట్టుకోవచ్చు. ఇక కిచెన్‌కు దక్షిణంలో గిన్నెలు తోముకునే గచ్చు పెట్టండి. అది దోషం కాదు. ఒకవేళ కిచెన్ చిన్నదిగా ఉందని అనుకుంటే.. కిచెన్‌కు దక్షిణం డోర్ పెట్టుకొని, తూర్పు – ఆగ్నేయం ఖాళీలో యుటిలిటీని ఏర్పాటుచేసుకుంటే శుభకరంగా ఉంటుంది. అనవసర ప్రయోగాలు వద్దు.

వాయవ్యం.. ఒకటా? రెండా? వీటిలో ఏది మంచిది? రెండూ ఉంటే.. అవి పెరిగి ఉండాలా? తగ్గి ఉండాలా?
– కె. సుధాకర్, దిల్సుఖ్నగర్
ఇంటికి విదిక్కులు రెండు ఉంటాయి. అంటే.. ఉత్తర వాయవ్యం, పశ్చిమ వాయవ్యం. మీకు ఏ దిక్కు పెరిగిందో రాయలేదు. పశ్చిమ వాయవ్యం పెరిగి ఉండొచ్చు. అయితే పడమరలో వీధి ఉండవద్దు. అప్పుడు దోషం అవుతుంది. ఉత్తర వాయవ్యం అసలు పెరిగి ఉండకూడదు. దానికి రోడ్డు ఉత్తరంలో ఉన్నా.. లేకున్నా! అలాగే, రెండు వాయవ్యాలు పెరిగి కోణంగా ఉండటం మంచిది కాదు. వాస్తవానికి మూలదిశలు ఎటో ఓ దిక్కు పెరిగి ఉండాలనేది శాస్త్రబద్ధం కాదు. అన్ని మూలలు మూలమట్టానికి కుదిరి ఉండాలనేది ముఖ్యమైన అంశం. సమకోణ చతుర్భుజం లేదా దీర్ఘచతురస్రంగా ఉంటే శ్రేష్ఠం. పెరగడం అనేది అదనం. అది వాటివాటి రూపురేఖలను బట్టి మారుతుంది.

ఇంటి మధ్య డౌన్ చేసి, దాన్ని డ్రాయింగ్ రూమ్‌గా చేసుకోవచ్చా?
– ఎ. లక్ష్మి, వర్గల్
ఇంటికి గర్భం అనేది ఇంట్లోని సభ్యులు కూర్చునే స్థలంగా వాడుకోవడం అవసరం. ఇంటి మధ్యభాగం డ్రాయింగ్ రూముగా వాడాలంటే తూర్పు అంతా ఓపెన్ పెట్టాలి. అది తప్పు. ఈశాన్యం గదినే డ్రాయింగ్ రూముగా చేసుకోవాలి. దానికి అనుబంధంగా.. దానిలో నుంచి ఇంటి గర్భంలోకి వెళ్లడానికి ద్వారం పెట్టుకొని వాడటం చాలా ముఖ్యం. ఇంట్లోని గదుల విభజన జరిగిన తర్వాత ఈశాన్యం గదికి ఇతర గదులకు వాతావరణంలో వ్యత్యాసాలు ఏర్పడతాయి. అది చాలా సాధారణం. కాబట్టి ఇంటి గర్భంలో ఫ్యామిలీ లాంజ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. మధ్యస్థానం లాంజ్‌గా వాడినా.. హాలుగా వాడినా.. ఆ స్థానం గచ్చులాగా కిందికి దించి (ఫ్లోరింగ్ కట్‌చేసి).. అందులోకి దిగేలా మెట్లు పెట్టుకొని వాడటం చాలా దోషం. మామూలు ఇండ్లు కట్టుకొని హాయిగా ఉండండి. మీది తూర్పు ఇల్లు కదా.. అనవసర ప్రయోగాలు వద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Read More :
Vasthu Shastra | సూపర్ బిల్డప్ ఏరియా అంటే ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అవన్నీ చూడాలా?
Read Today's Latest Vaasthu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

