షాపింగ్ అంటే మహిళలకు పిచ్చి అని తెలుసు కదా. వాళ్లకు కావాల్సిన డ్రెస్సులు కొనుక్కోవడం కోసం ఎన్ని గంటలైనా షాపింగ్ చేస్తారు. కానీ.. మార్కెట్‌కు వెళ్లి మాత్రం కూరగాయలు తీసుకురారు. దాని కోసం చాలామంది మహిళలు తమ భర్తలనే పంపిస్తుంటారు. వాళ్లకు గుర్తు ఉండవని.. ఒక లిస్టు రాసి ఇస్తారు. అందులో ఏదైనా మిస్ అయిందంటే.. ఇక ఇంటికి వచ్చాక ఉంటుంది.. దేత్తడి పోచమ్మగుడే ఇక. అందుకే.. ఏదీ మిస్ కాకుండా.. ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని మరీ.. భర్తలు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, ఇతర సరుకులను తీసుకొస్తారు.
అయితే.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది డిటెయిల్‌గా ఉన్న షాపింగ్ లిస్టు. ఎంత డిటెయిల్‌గా అంటే.. ఆ వస్తువు పేరు.. దాని ధర.. సూపర్ మార్కెట్లో ఎక్కడ ఉంటుంది. దాని ఇమేజ్‌తో సహా.. అన్నింటినీ లిస్టులో పొందుపరిచి.. తన భర్త ఆశ్చర్యపోయేలా చేసింది. అలాగే.. సూపర్ మార్కెట్‌కు వెళ్లే దారికి సంబంధించిన మ్యాప్ గీసి.. ఏ ర్యాక్‌లో ఏ వస్తువు ఉంటుందో దానికి సంబంధించిన వివరాలు అన్నీ ఇచ్చి తన భర్తను మార్కెట్‌కు పంపించింది ఆ భార్యామణి.
ఈ వీడియోను మెలిండా అనే మహిళ.. తన టిక్‌టాక్ అకౌంట్లో షేర్ చేసింది. వీడియో చివర్లో.. ఇదంతా ఉత్తుత్తి లిస్టే.. అంటూ చెప్పుకొచ్చింది ఆ మహిళ. అది ఉత్తుత్తి లిస్టు అయినా.. ఏదయినా.. నెటిజన్లు ఊరుకుంటారా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
నువ్వు ఇంత పక్కాగా లిస్టు పంపిస్తున్నావు. ఖచ్చితంగా ఏదో ఒక వస్తువును నీ భర్త మరిచిపోయి వస్తాడు చూడు.. అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటిదే మరో షాపింగ్ లిస్టు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంట్లో కూడా కూరగాయాలు ఏవి తేవాలి. ఎన్ని తేవాలి.. అవి పండినవా? లేక లేతవా? లాంటి అన్ని వివరాలు అందులో ఉన్నాయి.
This is the task I gave to my hubby last weekend!! Even U guys shud follow this list for happy customers #bigbasket #grofers #reliancefresh pic.twitter.com/cGkPuRAvE9
— Era Londhe (@eralondhe) September 23, 2017
Since many people wanted explanation of the vegetable list I gave to my husband @gaurav198512 , check for the answers 🙂 @zedchrmsm pic.twitter.com/s5pNJ7K2YP
— Era Londhe (@eralondhe) September 25, 2017