చేతిలో జెండా పట్టుకొని ఓ యువకుడు రోడ్డుపై పరుగందుకున్నాడు. అది 5 కిలోమీటర్లో..10 కిలో మీటర్లో కాదు..50 గంటల్లో 350 కి.మీ. పరుగు. రాజస్థాన్‌లో మొదలుపెట్టిన పరుగు ఢిల్లీకి చేరింది. ఇదేదో రికార్డు కోసం కాదు.. ఆర్మీ రిక్రూట్మెంట్లో జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆ యువకుడు పరుగందుకున్నాడు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్దకు చేరుకొని తన నిరసనగళాన్ని వినిపించాడు. కాగా, ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
రాజస్థాన్‌కు చెందిన సురేశ్ భిచార్(24)కు సైన్యంలో చేరాలని కల. అయితే, కొవిడ్ కారణంగా రెండేళ్లనుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిలిచిపోయింది. రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా అభ్యర్థులు కేంద్ర సర్కారును కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొనేందుకు సురేశ్ భిచార్ రాజస్థాన్ నుంచి రన్నింగ్ చేస్తూ వచ్చాడు.
మార్చి 29న తన పరుగు ప్రారంభించాడు. పెట్రోల్ బంకుల్లో విశ్రాంతి తీసుకుంటూ మళ్లీ పరుగు ప్రారంభించేవాడు. ప్రతి గంటకు దాదాపు ఆరు కిలోమీటర్లు పరుగెత్తాడు. చివరికి జంతర్‌మంతర్ చేరుకుని తన నిరసనగళాన్ని వినిపించాడు. రిక్రూట్మెంట్ లేక ఎంతో మంది ఏజ్‌బార్ అవుతున్నారని సురేశ్ ఆవేదన వ్యక్తంచేశాడు. కేంద్ర సర్కారు వెంటనే ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రారంభించాలని కోరాడు.
#WATCH दिल्ली: भारतीय सेना में शामिल होने के लिए इच्छुक एक युवा राजस्थान के सीकर से दिल्ली में एक प्रदर्शन में शामिल होने के लिए 50 घंटे में 350 किलोमीटर दौड़कर पहुंचा। pic.twitter.com/rpRVH8k4SI
— ANI_HindiNews (@AHindinews) April 5, 2022