చాయ్ అంటే పాలు, టీ పౌడర్, అల్లం లేదా ఇలాచీ వేసి చేస్తారు. గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీలను పాలు లేకుండా చేస్తారు. అయితే, వివిధ రకాల పండ్లతో చాయ్ చేయడం మీరెక్కడైనా చూశారా? కనీసం విన్నారా? అలాంటి వింత చాయ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ చాయ్‌వాలా పండ్లతో చాయ్చేసి, ఆశ్చర్యపరిచాడు. పాలల్లో టీపౌడర్ వేసి, అనంతరం అరటిపండు, ఆపిల్, సపోటా కట్‌చేసి వేశాడు. అనంతరం చాయ్ మరిగాక వడగట్టి సప్లై చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 65,000 లైక్స్ వచ్చాయి.