అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు ఆ దేశవ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారు. వారంతా వివిధ రూపాల్లో ట్రంప్‌పై తమ అభిమానం చూపిస్తూ ఉంటారు. కాగా, ఓ అభిమాని తన తలపై మోడీ రూపం వచ్చేలా కటింగ్ చేయించుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ వ్యక్తికి బార్బర్ కటింగ్ చేస్తూ ఉంటాడు. తల వెనుకభాగంలో ట్రంప్ ముఖాన్ని అచ్చుగుద్దినట్లు కట్‌చేశాడు. మొదట చూసినవారంతా ఇది పెయింటింగ్ లేదా టాటూ అనుకుంటున్నారు. ఈ చిన్న వీడియో క్లిప్‌ను ఇప్పుటి వరకూ 1.8 లక్షల మంది వీక్షించారు. పలువురు ఆసక్తికర కామెంట్లు చేశారు. దేశభక్తి అంటే ఇది అని కొందరు కామెంట్ చేయగా, తమకు ట్రంప్ నచ్చకున్నా ఈ కటింగ్ మాత్రం నచ్చిందని మరికొందరు మనసులో మాట చెప్పారు.