నిచ్చెనపైకి ఎక్కి పనిచేస్తున్నప్పుడు కొందరు ఒక్కోసారి కాలిజారిపడిపోతుంటారు. అంత ఎత్తునుంచి పడితే దెబ్బలు మామూలుగా తగలవు. చెయ్యో కాలో విరుగుతుంది. అయితే, తనతోపాటే పనిచేస్తున్న వ్యక్తి నిచ్చెనపై పడిపోతుండగా మరో వ్యక్తి చాకచక్యంగా పట్టుకున్నాడు. సాటి వర్కర్‌కు దెబ్బలుతగలకుండా కాపాడాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ గదిలో ఒకరు నిచ్చెనపైన పనిచేస్తుండగా, మరొకరు పైన ఉన్న అతడికి సహాయం చేస్తున్నాడు. పైనున్న వ్యక్తి ఏదో పరికరం ఇవ్వాలని అడగగా కిందున్న వ్యక్తి వంగితీసేలోపే నిచ్చెన జారి పైనున్న వ్యక్తి కిందపడబోయాడు. కింద ఉన్న వ్యక్తి అప్రమత్తమై పడిపోతున్న వ్యక్తిని క్యాచ్ చేశాడు. ఇద్దరు సురక్షితంగా నేలపై పడిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ దెబ్బలు తగలలేదు. ఈ వీడియో చూసినవారంతా తనతోటి వర్కర్‌ను కాపాడిన వ్యక్తిని మెచ్చకుంటున్నారు. ఈ వీడియో పెట్టిన అతికొద్దిరోజుల్లోనే 2.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి.