కచ్చా బాదాం పాట ప్రపంచాన్నే ఓ ఊపు ఊపేస్తున్నది. ఇన్స్టాలో ఎక్కడ చూసినా ఈ బెంగాలీ పాటపై రీల్సే దర్శనమిస్తున్నాయి. సామాన్య ప్రజలనుంచి మొదలుకుని సెలబ్రిటీల దాకా ఈ పాటపై స్టెప్పులేసి మురిసిపోతున్నారు. కాగా, కేరళ పోలీసు అధికారులు పోలీస్ యూనిఫాంలో ఈ పాటపై స్టెప్పులేయగా, సోషల్మీడియాలో వైరల్గా మారింది.
ఓ మహిళా అధికారితో కలిసి నలుగురు పోలీసులు ఈ పాటపై లయబద్ధంగా స్టెప్పులేశారు. హుక్స్టెప్ వేసేందుకు ప్రయత్నించారు. మహిళా అధికారి అచ్చుగుద్దినట్లు నర్తించగా, మిగతా నలుగురు పోలీసు అధికారులు కాస్త తడబడ్డారు. ఈ వీడియోను కొచ్చిలోని హోటల్ డ్యూలాండ్ ఎంట్రన్స్ వద్ద షూట్ చేశారు. కాగా, ఈ వీడియోకు మిశ్రమ స్పందన వచ్చింది. అయితే, ఇందులో ఉంది నిజంగా పోలీసులా? కాదా? అనే దానిపై చాలామంది అనుమానం వ్యక్తంచేశారు.
Why shouldn’t khaki have some fun. Watch out on left and right most. pic.twitter.com/izKTzrq0Sm
— Da_Lying_Lama🇮🇳 (@GoofyOlives) March 21, 2022