మనం సాధారణంగా నూడుల్స్ తిన్నాక ఐస్‌క్రీం తింటాం. కానీ, ఇక్కడ ఏకంగా నూడుల్స్ సూప్‌లోనే ఐస్‌క్రీం ఏసుకొని లాగించేస్తున్నారు. ఈ వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదెక్కడి వెరైటీరా బాబూ అంటూ నెటిజన్లు తలపట్టుకుంటున్నారు.
ఈ కొత్త వంటకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది జపాన్. ఈ దేశంలోని ఓ రెస్టారెంట్లో రామెన్ (నూడుల్స్)లో మీసో ఐస్‌క్రీం వేసి సర్వ్ చేస్తున్నారు. కస్టమర్లు లొట్టలేసుకుంటూ ఈ వంటకాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను జెస్సే ఒగుండిరన్ అనే ఫుడ్ బ్లాగర్ పోస్ట్ చేసింది. మిలియన్ లైక్స్‌తో దూసుకుపోతున్నది.