Viral video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో వైరల్ అవుతుంటాయి. వాటిలో క్రీడలకు సంబంధించినవి, కళలకు సంబంధించినవి, వ్యక్తిగత ప్రతిభకు సంబంధించినవి, జంతువులకు సంబంధించినవి ఉంటాయి. ముఖ్యంగా జంతువులు చేసే కొన్ని పనులు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక వీడియోనే ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
సాధారణంగా కుక్కకు, పిల్లికి అస్సలు పడదు. కుక్కను చూస్తే పిల్లి ఆమడ దూరం పరుగు తీస్తుంది. పిల్లి కనిపిస్తే కుక్క వెంటపడి తరుముతుంది. కానీ, అత్యంత అరుదుగా పిల్లి, కుక్క ఒకదానితో ఒకటి స్నేహం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. తాజా వీడియోలో అలాంటి స్నేహమే కనిపిస్తుంది. ఓ పిల్లి తన పిల్లతో కలిసి కుక్క దగ్గరికి వెళ్లింది.
అంతేగాక తన చిట్టి పిల్లి పిల్లను ఆ కుక్కకు పరిచయం చేసింది. దాంతో కుక్క కూడా ఆ పిల్లి పిల్లను మురకచూస్తూ ముద్దు చేసింది. ఈ వీడియోను @buitengebieden అనే యూజర్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. మరి ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేస్తారా..
Mommy introduces her kitten to the dog.. ☺️ pic.twitter.com/udxzicC4B2
— Buitengebieden (@buitengebieden) February 3, 2023