అమెరికాలో గన్ కల్చర్ ఎక్కువ. పట్టపగలే దొంగలు దుకాణాల్లో చొరబడుతుంటారు. పట్టపగలే నేరాలు జరుగుతుంటాయి. చేతికి అందినవి లాక్కుని వెళ్లిపోతుంటారు. తాజాగా ఓ దుకాణంలోనూ ఓ ముగ్గురు ముసుగు దొంగలు చొరబడ్డారు. దొంగతనం చేసేందుకు యత్నించారు. అయితే, అక్కడే ఉన్న ఓ మహిళ వారిపై శివంగిలా దూకింది. వాళ్లకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
న్యూయార్క్ మాన్హాట్టన్లోని రెస్క్యూ స్పాలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు దొంగలు ముసుగులు వేసుకుని స్పాలోకి ఎంటర్ అయ్యారు. ఏదో వెతుకుతున్నట్లు నటించి కొన్ని వస్తువులను జేబులో వేసుకున్నారు. అక్కడ పనిచేసే మహిళ ఇది గమనించింది.
వెంటనే పరిగెత్తుకెళ్లి వారిలో ఒకరిని అడ్డగించింది. ఇదిచూసి మిగతా ఇద్దరు పారిపోయారు. అయితే, ఆ మహిళను దొంగ గట్టిగా కొట్టాడు. అయినా, ఆమె వదలలేదు. చివరికి దెబ్బలు భరించలేక వదిలిపెట్టింది. అయితే, ఆ మహిళ వల్ల స్పాకు చాలా నష్టం తప్పిందని, ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని స్పా ఓనర్ జెన్నిఫర్ చెప్పారు. ఈ వీడియో సోషల్మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
WANTED for ROBBERY: On 3/19/22 @ 2:41 PM, @NYPD13PCT inside 29 E 19 St the unidentified individuals enter the location & begin removing property when approached by a female she was assaulted as the subject's fled. ANY info call us @ 800-577-TIPS or DM NYPDTips Reward up to $3500. pic.twitter.com/A5qWVAkpr1
— NYPD Crime Stoppers (@NYPDTips) March 22, 2022