అప్పుడప్పుడూ భలే వింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి మనకు ఆశ్చర్యంతోపాటు నవ్వు తెప్పిస్తుంటాయి. చైనాలో జరిగిన ఈ ఘటన అలాంటిదే. ఓ వ్యక్తి ప్లేట్లో ఉన్న చేపను తిందామనుకునేలోపే అది నోరు తెరిచింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది.
ఈ సరదా ఘటన చైనాలో జరిగింది. ఓ హోటల్లో టేబుల్‌పై హోల్ ఫిష్ సర్వ్ చేశారు. ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ తిందామని రెడీ అయ్యాడు. అయితే, అందులో ఒక చేప నోరు తెరిచింది. దీంతో ఆశ్చర్యపోయిన అతడు ప్లేట్‌ను అక్కడే వదిలేశాడు. చేప ఎలా నోరు తెరుస్తుందో చూయిస్తూ వీడియో తీశాడు. ఈ వీడియోను ఇంటర్నెట్లో పెట్టగా, వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.