పశ్చిమబెంగాల్లో పల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ పాడిన ‘కచ్చా బాదాం’ సాంగ్ ఫీవర్నుంచి ఇంకా ఇంటర్నెట్ తేరుకోనేలేదు. అప్పుడే మరో పాట సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై అంగూర్లు అమ్ముకునే వ్యక్తి పాడిన పాటకు నెట్టింట భారీ స్పందన వస్తున్నది. ఇన్స్టాలో పెట్టిన ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు.
రోడ్డు సైడ్ బ్లాక్ గ్రేప్స్ అమ్ముకునే వ్యక్తి లయబద్ధంగా ఓ పాట అందుకున్నాడు. ‘లే లో పంద్రా రూపాయ్కో బారా అంగూర్’ (తీసుకోండి 15 రూపాయలకు 12 అంగూర్లు) అంటూ అతడు పాడిన పాటను @saaliminayatHighlights అనే యూజర్ ఇన్స్టాలో పెట్టారు. దీంతో ‘కచ్చా బాదాం’లాగా ఈ పాటకూడా ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 2.5మిలియన్ల మంది వీక్షించారు. 109కే లైక్స్ వచ్చాయి.