పొడవాటి పంజా..పదునైన దంతాలు.. బలమైన దవడ ఉన్న ఓ వింత జంతువు ఓ వ్యక్తికి ఇంటిపై కనిపించింది. దాన్ని చూడగానే అతడికి గుండె జారిపోయినంత పనైంది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ వింత జంతువును పట్టుకున్నారు.
ఈ సంఘటన అమెరికాలోని అరిజోనాలో జరిగింది. ఇంటిపై వింతజీవిని చూసిన ఓ వ్యక్తి ప్రెస్కాట్ వ్యాలీ పోలీస్ డిపార్ట్మెంట్కు కాల్ చేశాడు. ఫోన్ అందుకోగానే యానిమల్ కంట్రోల్ సూపర్వైజర్ టిమ్ యోగర్ట్స్ రంగంలోకి దిగారు. వింత జీవిని బంధించారు. ఆ భయంకర, వింత జీవి ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా, వైరల్ అవుతోంది.
ఆ వింత జంతువు కోటి లేదా క్రిట్టర్ కోటిముండి అని పోలీసులు తేల్చారు. ఈ జంతువులు సాధారణంగా మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో నివసించే రకూన్ కుటుంబానికి చెందినవని పేర్కొన్నారు. ఈ జంతువుల నివాసం అరిజోనా రాష్ట్రంలో నైరుతి యూఎస్ వరకు విస్తరించి ఉన్నప్పటికీ కొటిస్లు చాలా అరుదుగా కనిపిస్తాయని తెలిపారు. ఇవి రేబిస్‌ను కలిగి ఉండవని, కానీ, మనుషులను గాయపరుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు ఈ జంతువు ఫొటోతోపాటు దాని గురించి క్షుప్తంగా ఫేస్బుక్ పోస్ట్‌లో వివరించారు.