ఫిరాయింపులపై బీజేపీ నేతల నీతులా?.. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు.
- గత చరిత్రను తెలుసుకోండి
- ఫిరాయింపులు మొదలుపెట్టింది కాంగ్రెస్.. కొనసాగిస్తున్నది బీజేపీ
- ఏడీఆర్ తాజా నివేదికే సాక్ష్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. వారి మాటలు దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉన్నదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అడ్డగోలుగా మాట్లాడే ముందు ఫిరాయింపు రాజకీయాలను మొదలుపెట్టింది కాంగ్రెస్.. ఇప్పుడు కొనసాగిస్తున్నది బీజేపీ కాదా? అని సూటిగా ప్రశ్నించారు. ఫిరాయింపులపై బీఆర్ఎస్కు నీతులు చెప్పేముందు గత చరిత్ర తెలుసుకోవాలని చురకలంటించారు.
గత గురువారం విడుదల చేసిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నివేదికే రెండు పార్టీల వైఖరికి అద్దంపట్టిందని విమర్శించారు. ‘2022 నుంచి 2026 మధ్య గెలిచిన 111 మంది పార్టీలు మార్చినట్టు వెల్లడించింది. బీజేపీ దాని మిత్రపక్షాలైన ఎన్పీఎఫ్, ఎన్సీపీ, శివసేన, ఎన్పీపీ, పీపీఏ పార్టీల్లోకే అత్యధికులు చేరారు’ అని గుర్తుచేశారు. ఈ గణాంకాలే బీజేపీ ఫిరాయింపు రాజకీయాలకు సజీవ సాక్ష్యమని దెప్పిపొడిచారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కాంగ్రెస్‌దే బాధ్యత అని తేల్చిచెప్పారు.
పదో షెడ్యూల్‌ను సవరించాలి
పదో షెడ్యూల్‌ను సవరించాల్సిన అవసరమున్నదని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. లేదంటే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేశారు. 10వ షెడ్యూల్ కింద దాఖలైన అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకొనేలా చట్టబద్ధమైన గ డువు విధించాలని డిమాండ్ చేశారు. బీ జేపీ సత్వరమే ఆ బిల్లు తేవాలని, దానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

