హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 27న హైదరాబాద్‌లో స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూ టీఎస్) 80 వసంతాల వైభవోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందంగౌడ్, జుట్టు గజేందర్ తెలిపారు.
నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు తదితరులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. 80 ఏండ్ల సుధీర్ఘ ప్రస్తానాన్ని స్మరించుకుంటూ భవిష్యత్తు విద్యారంగం అభివృద్ధికి పునరంకితమవుతామని పేర్కొన్నారు. ఈ వైభవోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీచర్లు, సంఘం నాయకులు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.