మేధా రూపమ్ పిటిషన్‌పై ఎందుకంత ప్రాధాన్యత?
విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌదరిపై ఉన్న జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కేసులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె, నోయిడా జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంపై రాజ్యాంగ న్యాయవాదుల సంఘం (ఎల్ఏఎఫ్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఒక బహిరంగ లేఖ రాసింది. అమలులో ఉన్న రోస్టర్ ఉండగా, రూపమ్ పిటిషన్‌ను ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట బెంచ్‌కు కేటాయించారని ఈ సంఘం ఆరోపించింది.
- సీజేఐకు న్యాయవాదుల సంఘం లేఖ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: విద్యార్థి కార్యకర్త ఆకృతి చౌదరిపై ఉన్న జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కేసులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె, నోయిడా జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ దాఖలు చేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడంపై రాజ్యాంగ న్యాయవాదుల సంఘం (ఎల్ఏఎఫ్సీ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు ఒక బహిరంగ లేఖ రాసింది. అమలులో ఉన్న రోస్టర్ ఉండగా, రూపమ్ పిటిషన్‌ను ప్రత్యేకంగా ఒక నిర్దిష్ట బెంచ్‌కు కేటాయించారని ఈ సంఘం ఆరోపించింది.
ఆమె సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కుమార్తె కావడం కూడా ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదని పేర్కొంది. ‘ఈ కేసును క్రమం తప్పించి విచారణ జాబితా చేయడం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది ఒక తప్పుడు సంప్రదాయానికి దారితీసే అవకాశం ఉంది’ అని ఆ లేఖలో తెలిపింది. 2026లో కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జరిగిన ఆందోళనలో ఢిల్లీకి చెందిన విద్యార్థిని ఆకృతి చౌదరి పాల్గొనగా, ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.
తర్వాత ఆమెపై ఎన్ఎస్ఏ కింద నిర్బంధ ఉత్తర్వులను మేధా రూపమ్ జారీ చేశారు. దీనిపై ఆకృతి చౌదరి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, ఆ ఉత్తర్వులను కొట్టివేసిన కోర్టు ఆమెను అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ రూ.5లక్షల జరిమానా విధిస్తూ దానిని మేధా, ఇతర అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. దీనిపై మేధా సుప్రీంను ఆశ్రయించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

