వివాహం తర్వాత మానసికంగా దృఢంగా మారారు రష్మిక మందన్నా. ఆమె ఎక్కడ మాట్లాడినా ఆ మాటల్లో ఓ పరిపూర్ణత్వం గోచరిస్తున్నది. తాజాగా ఇంటి ఇల్లాలుగా తన బాధ్యతల గురించి అద్భుతంగా మాట్లాడారామె. ‘నా కుటుంబం అభ్యున్నతే నాకు ముఖ్యం. ఇప్పుడు ఇల్లాలిని మాత్రమే. త్వరలో తల్లిని కూడా అవుతా.
అప్పుడు నా పిల్లల భద్రత కోసం, వారి సంతోషం కోసం అవసరమైతే ప్రపంచంతో పోరాడతా. నా కుటుంబానికి అందాల్సిన ప్రశాంతత, భద్రత విషయంలో రాజీపడను. మానవ సంబంధాలు, భావోద్వేగ అనుబంధాలకే నా ప్రథమ ప్రాధాన్యత’ అని రష్మిక పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.