కొంతమంది విద్యార్థులు సాధారణంగా ఓ ఐదు, పది నిమిషాలు లేట్‌గా వస్తుంటారు. కొందరు టీచర్లు కారణం అడిగి లోపలికి అనుమతిస్తుంటారు. కొందరు బయటే కొంతసేపు నిల్చోబెడుతుంటారు. కానీ ఓ అమెరికా ప్రొఫెసర్ వ్యవహరించిన తీరు అందరికీ కోపం తెప్పించింది. రెండు నిమిషాలు లేట్‌గా వచ్చిన విద్యార్థులను బయటికి పంపేందుకు ఆ ప్రొఫెసర్ పోలీసులను తీసుకొచ్చింది. ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ సంఘటన యూఎస్‌లోని జార్జియా స్టేట్ యూనివర్సిటీలో జరిగింది. ఇద్దరు విద్యార్థులు తరగతికి రెండు నిమిషాలు లేట్‌గా వచ్చారు. దీంతో ఆ క్లాస్‌లో ఉన్న ప్రొఫెసర్ కెరిస్సా గ్రే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయింది. వారిని అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అందులో ఒకరు ఎదురుమాట్లాడగా, ఆ ప్రొఫెసర్ కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే వెళ్లి క్యాంపస్ పోలీసులను పిలుచుకొచ్చింది. ఏం జరుగుతుంతో తెలియక విద్యార్థులు బయపడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న యూనివర్సిటీ అధికారులు సదరు ప్రొఫెసర్‌ను విధులనుంచి తప్పించారు.