సడెన్గా ఒక పెద్ద ఎలుగు బంటి మన ఇంట్లోకి వచ్చేసిందనుకో.. ఏం చేస్తాం? భయంతో బిక్కచచ్చిపోతాం. కానీ ఒక జంట మాత్రం ధైర్యంగా దాంతో పోరాడింది. చివరకు ఓడించింది కూడా. ఈ ఘటన అమెరికాలోని విస్కాన్సిన్లో వెలుగు చూసింది. ఇంటి బయట పిట్టల కోసం పెట్టిన ఆహారాన్ని ఒక పెద్ద ఎలుగు బంటి వచ్చి తినడాన్ని ఆ ఇంట్లో ఉన్న జంట చూశారు. దాంతో తలుపులు ఓరగా తెరిచి అరిచారు.
ఎలుగు బంటిని బయటకు తోలేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్లు అరవడంతో రెచ్చిపోయిన ఎలుగు.. పక్కనే ఉన్న కిటికీ బద్దలుకొట్టి ఆ ఇంట్లో చొరబడింది. దాంతో భయపడిపోయిన ఆ జంట.. వంట గదిలో ఉన్న కత్తులు తీసుకొని దాంతో పోరాడారు. ఈ క్రమంలో వాళ్లకు కూడా దెబ్బలు తగిలాయి. అయితే కాసేపు పోరాడిన తర్వాత ఇంట్లో ఉన్న తుపాకీతో ఆ ఎలుగు బంటిని కాల్చి చంపేసిందా జంట.
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఆ జంటను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. పక్క గదిలో పడుకొని ఉన్న వాళ్ల పిల్లలకు ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. ఇటీవలి కాలంలో విస్కాన్సిన్ ప్రాంతంలో ఎలుగు బంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు.