పెళ్లి మండపంలోకి పోలీసుల ఎంట్రీ..! పారిపోయిన వధూవరులు..!! అసలేం జరిగిందంటే..?
Viral | పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపానికి చేరుకున్నాడు. బంధు, మిత్రులంతా వేడుకకు తరలివచ్చారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటలపై నుంచి పారిపోయారు. ఆ తర్వాత పోలీసులు వరుడి తండ్రితో పాటు సోదరుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20న రాత్రి మన్సుఖ్పురాలోని కర్కౌలి గ్రామంలో పెళ్లికి వైభవోపేతంగా ఏర్పాట్లు చేశారు. వరుడు బ్యాండ్ మేళంతో ఊరేగింపుగా బంధువులతో కలిసి వధువు ఇంటికి చేరుకున్నాడు.
ఈ క్రమంలో యువతి మైనర్ అంటూ గ్రామస్తుడు ఒకరు మన్సుఖ్పురా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్టేషన్ ఇన్చార్జి గిరీష్‌కుమార్ పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
దీంతో పోలీసులను చూడగానే బంధువులంతా ఖంగుతిన్నారు. పోలీసులను చూసిన తర్వాత వధూవరులు భయపడి పీటల మీద నుంచి పొలాల వైపు పారిపోయారు. ఆ తర్వాత బంధువులు సైతం వివాహ వేదిక నుంచి ఎవరి ఇండ్లకు వారు వెళ్లిపోయారు. వరుడు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలోని నయాపుర అంబాహ్ అని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వరుడి తండ్రి, సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌లో విచారించారు. బాలిక వయసుకు సంబంధించిన పత్రాలతో రావాలని సూచించినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. మైనర్‌కు వివాహం జరిపించినట్లయితే నిందితులందరిపై చర్యలుంటాయని ఎస్హెచ్ఓ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. వరుడు గత 15 రోజుల కిందట పొరుగున ఉన్న బంధువులపై వేధింపులకు పాల్పడగా.. కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

