వేసవి కాలం పీక్ స్టేజికి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంటినుంచి బయట అడుగుపెట్టినప్పుడు ఎండవేడిమిని తట్టుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. కొందరు క్యాప్ పెట్టకుంటే, మరికొందరు స్కార్ఫ్ కట్టుకుంటున్నారు. ఇంకొందరు గొడుగులతో కనిపిస్తున్నారు. అయితే, ఓ రిక్షా యజమాని తన ప్రయాణికులకు మండుటెండలోనూ జర్నీ కూల్ ఉండేలా రిక్షా స్వరూపాన్నే మార్చేశాడు. రిక్షాపై రూఫ్‌టాప్ గార్డెన్ ఏర్పాటు చేశాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలో రిక్షా ముందు సీట్లో డ్రైవర్ కూర్చుని ఉన్నాడు. రిక్షా మొత్తం పచ్చని గడ్డితో కప్పేసి ఉంది. రిక్షాకు పక్కల కుండీల్లోనూ పచ్చని మొక్కలు దర్శనమిస్తున్నాయి. ఈ ఎకో రిక్షా ప్రపంచ పర్యావరణవేత్త, యూఎన్ఈపీ (యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం) మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్హెమ్ కంటపడింది. ఆయన ఈ ఫొటోను ట్విటర్లో పెట్టగా, వైరల్‌గా మారింది. ఈ ఫొటో 21,00 0 లైక్స్, 2,000 రీట్వీట్లతో దూసుకుపోతున్నది.
This Indian 🇮🇳 man grew grass on his rickshaw to stay cool even in the heat. Pretty cool indeed! pic.twitter.com/YnjLdh2rX2
— Erik Solheim (@ErikSolheim) April 4, 2022