కోల్‌కతా : జీవితంలో తొలిసారి ఎస్కలేటర్‌ను ఉపయోగించడంలో కొంతమంది ఇబ్బందిపడుతుంటారు. కోల్‌కతా మెట్రో స్టేషన్లో కొందరు మహిళలు తొలిసారి ఎస్కలేటర్‌పై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యాధర్ జెనా అనే యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 25,000కుపైగా వ్యూస్ రాగా నెటిజన్ల నుంచి పెద్దఎత్తున రియాక్షన్స్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోలో కొంతమంది మహిళలు తొలిసారిగా ఎస్కలేటర్‌ను వాడుతూ ఇబ్బందిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి పైనుంచి వారికి సాయం చేస్తూ ఉండటం కనిపించింది.
కొంత తడబాటుకు లోనైనా మహిళలందరూ ఎస్కలేటర్‌ను బాగానే ఉపయోగించుకున్నారు. పాదరక్షలు లేకుండా ఎస్కలేటర్‌పై వారు పైఅంతస్తుకు చేరుకున్నారు. వీరంతా యాత్రికులని, ఓ ఆలయానికి వెళుతున్నారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. వైరల్ వీడియోపై నెటిజన్లు తలోరకంగా స్పందించారు.