Uttarpradesh | నాణ్యత లేని రోడ్డుని చేతులతో తొలగించి నిరసన తెలిపాడు.. వైరల్ అవుతున్న వీడియో
నాణ్యతలేని ప్రధానమంత్రి సడక్ యోజన రోడ్డుని చేతులతో తొలగించి నిరసన
గుంతల రోడ్లు, నాణ్యత లేని రోడ్ల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కొందరు వెరైటీగా నిరసన తెలియజేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని పిలిబ్హిట్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తమ ప్రాంతంలోని తారురోడ్డు నాసిరకంగా ఉండడం పట్ల సరికొత్తగా నిరసన తెలిపాడు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత లేదని, ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యాన్నిఎత్తి చూపేందుకు రోడ్డు పైభాగాన్నిచేతులతో తొలగించి చూపించాడు. అతను రోడ్డు పై భాగాన్ని చేతులతో తొలగిస్తున్న వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. వీడియోలో అతను నాణ్యత లేని రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులు కోరాడు.
ప్రధాన మంత్రి సడక్ యెజన పథకం కింద పురాణాపూర్, భగవంతపూర్ గ్రామాల మధ్య రూ.3.8 కోట్ల ఖర్చుతో ఈమధ్యే రోడ్డు వేశారు. రెండు రోజుల క్రితం రోడ్డు మీదుగా వెళ్తున్న పెద్ద వాహనాన్ని డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేసి ఆపాడు. దాంతో, రోడ్డు మీది తారు పొరలుగా లేచింది. దాంతో, ఒక వ్యక్తి చేతులతో రోడ్డు మీది తారును తొలగిస్తూ, రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్ నిర్యాక్షాన్నిఎత్తి చూపాడు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాణ్యత లేని రోడ్డు వేశారంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
ఈమధ్యే కేరళలో ఒక నవవధువు గుంతలు, బురదతో నిండిన రోడ్డు మీద ఫొటోషూట్ దిగింది. ఒకాయన అయితే ఏకంగా రోడ్డు మీద నిలిచిన వర్షం నీళ్లలోకి దిగి, అక్కడే స్నానం చేశాడు. దాంతో, వాళ్ల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి.
पीलीभीत में 3.81 करोड़ रुपये से बनी नई सड़क, शख्स ने हाथों से उखाड़ कर दिखाई क्वालिटी#Pilibhit #UttarPradesh #BrokenRoads pic.twitter.com/lhkMZMJDCX
— Zee News (@ZeeNews) November 13, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

