ప్రస్తుత కాలంలో యువతను ఎక్కువగా వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. పోషకాహారలోపం, జంక్‌ఫుడ్, కెమికల్ షాంపూలు వాడడంతో చాలామందికి చిన్న వయస్సులోనే జుట్టు ఊడిపోతున్నది. ఇదే సమస్య నిక్ కోయెట్టీకి వచ్చింది. అతడికి చిన్నవయస్సులోనే జుట్టంతా రాలడం ప్రారంభమైంది. స్కూల్ ఫస్ట్ పీరియడ్ అయిపోగానే, అతడి షర్ట్‌పై మొత్తం తల వెంట్రుకలే ఉండేవి. దీంతో అతడు ప్రతిరోజూ స్కూల్‌కు రెండు లేదా మూడు షర్ట్లు తీసుకెళ్లేవాడు. మధ్య మధ్యలో షర్ట్ చేంజ్ చేసుకునేవాడు.
తాను వాడే షాంపూలు, కండిషనర్లతో జుట్టు ఎక్కువగా రాలుతున్నదని నిక్ తెలుసుకున్నాడు. దీంతో తలస్నానం చేయొద్దని డిసైడ్ అయ్యాడు. ఏకంగా ఆరేళ్లు తలస్నానమే చేయలేదు. ఇప్పుడు జుట్టు ఊడడమంటే ఏంటో కూడా తనకు తెలియడం లేదని నిక్ చెబుతున్నాడు. తలస్నానం చేయకుంటే ఓ రెండు వారాలపాటు మురికిగా అనిపిస్తుందని, ఆ తర్వాత తలలో సహజనూనెలు ఉత్పత్తి అవుతాయని, వాటికవే ఫ్రెష్‌గా మారిపోతాయని నిక్ అంటున్నాడు. మనం తలస్నానం చేయాల్సిన అవసరమే లేదని నిక్ చెబుతున్నాడు.